Mohammed Shami to play in Syed Mushtaq Ali Trophy 2025 for Bengal
Mohammed Shami : టీమ్ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మరోసారి రాణించి సెలక్టర్లకు సవాల్ విసిరేందుకు సిద్ధం అయ్యాడు. డిసెంబర్‌లో జరగనున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాలని షమీ నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోషియేషన్‌కు ఇప్పటికే తన నిర్ణయాన్ని అతడు తెలియజేసినట్లుగా రేవ్ స్పోర్ట్స్ పేర్కొంది.
మహ్మద్ షమీ చివరిసారిగా భారత్ తరుపున ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగాడు. ఈ టోర్నీ తరువాత అతడు మరోసారి భారత జెర్సీలో కనిపించలేదు. ఆసియాకప్ 2025తో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.
రంజీల్లో అదుర్స్..
అయితే.. సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు షమీ. ఇటీవల జరిగిన రంజీట్రోఫీలో బెంగాల్ తరుపున బరిలోకి దిగాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు.
ఇక వచ్చే ఏడాది అతడు ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడనున్నాడు. ఇటీవల జరిగిన ట్రేడింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు షమీని లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడింగ్ చేసింది. ఇక లక్నో నుంచి రూ.10 కోట్ల మొత్తాన్ని షమీ అందుకోనున్నాడు.