Parthiv Patel : వాట‌ర్ బాటిళ్లు అందించి పెద్ద ఇళ్లు క‌ట్టుకున్నా.. 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న పాత్ర‌పై పార్థివ్ ప‌టేల్ కామెంట్స్‌..

టీమ్ఇండియా మాజీ వికెట్ కీప‌ర్ పార్థివ్ ప‌టేల్ (Parthiv Patel) ఇటీవ‌ల ఓ కామెడీ షోలో పాల్గొన్నాడు.

Parthiv Patel : వాట‌ర్ బాటిళ్లు అందించి పెద్ద ఇళ్లు క‌ట్టుకున్నా.. 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న పాత్ర‌పై పార్థివ్ ప‌టేల్ కామెంట్స్‌..

Parthiv Patel Funny Remark On His 2003 World Cup Role

Updated On : November 20, 2025 / 1:52 PM IST

Parthiv Patel : టీమ్ఇండియా మాజీ వికెట్ కీప‌ర్ పార్థివ్ ప‌టేల్ ఇటీవ‌ల ఓ కామెడీ షోలో పాల్గొన్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు చేసిన ఓ ఫ‌న్నీ వ్యాఖ్య వైర‌ల్ అవుతోంది. షోలో ఓ సంద‌ర్భంలో నీటి గురించి చ‌ర్చ వ‌చ్చింది. అప్పుడు పార్థివ్ మాట్లాడుతూ.. 2003 ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్లేయ‌ర్ల‌కు వాట‌ర్ బాటిళ్లు తీసుకెళ్లి ఓ పెద్ద ఇల్లు క‌ట్టుకున్నాన‌ని చ‌మ‌త్క‌రించాడు.

పార్థివ్ ప‌టేల్ 2002లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2003కి ఎంపిక అయ్యాడు. అత‌డు జ‌ట్టులో భాగ‌మైన‌ప్ప‌టికి కూడా అత‌డికి ఒక్క మ్యాచ్‌లో ఆడేందుకు అవ‌కాశం రాలేదు. ఎందుకంటే.. వికెట్ కీప‌ర్ బాధ్య‌త‌ల‌ను అప్పుడు సీనియ‌ర్ ఆట‌గాడు రాహుల్ ద్ర‌విడ్ నిర్వ‌ర్తించ‌డ‌మే కార‌ణం. ఈ మెగా టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భార‌త్ 125 ప‌రుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

Harbhajan Singh : భ‌జ్జీ ఎంత ప‌ని జేస్తివి.. పాక్ ఆట‌గాడితో.. వీడియో వైర‌ల్‌..

షోలో పాల్గొన్న పార్థివ్ ప‌టేల్ మాట్లాడుతూ.. ‘నీటి గురించి మాట్లాడ‌కండి. నేను 85 వ‌న్డే మ్యాచ్‌ల్లో ఆట‌గాళ్ల‌కు నీటిని అందించాను. రాహుల్ ద్ర‌విడ్ వికెట్ కీప‌ర్‌గా ఉన్న‌ప్పుడు ప్లేయ‌ర్‌కు పానియాలు తీసుకువెళ్లేవాడిని. ఇక 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మొత్తం నేను గ్రౌంగ్‌లోని ప్లేయ‌ర్ల‌కు నీళ్లు అందించా. కానీ ఆ స‌మ‌యంలో నీళ్ల సీసాలు మోసుకెళ్లి పెద్ద ఇల్లు క‌ట్టుకున్నాను.’ అని చ‌మ‌త్క‌రించాడు.

ప్లింటాఫ్ స్లెడ్జింగ్ చేస్తే..

ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా పార్థివ్ చాలా చిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టెస్ట్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన వికెట్ కీపర్ (17 సంవత్సరాల 152 రోజులు) గా రికార్డుల‌కు ఎక్కాడు. త‌న తొలి విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ప్లింటాఫ్ త‌న‌ను స్లెడ్జింగ్ చేశాడని చెప్పుకొచ్చాడు. అయితే.. గుజరాతీ మీడియం స్కూల్‌లో చదుకోవ‌డం వ‌ల్ల త‌న‌కు ఏమి అర్థం కాలేద‌న్నాడు.

IND vs PAK : ఇదేం ట్విస్ట్ సామీ.. భారత్, పాక్ మ్యాచ్ లేకుండానే వరల్డ్ కప్ షెడ్యూల్.. రిలీజ్ చేసిన ఐసీసీ

టీమ్ఇండియా త‌రుపున పార్థివ్ ప‌టేల్ 25 టెస్టులు ఆడాడు. 31.13 స‌గ‌టుతో 934 ప‌రుగులు చేశాడు. ఇక 38 వ‌న్డేల్లో 23.74 స‌గ‌టుతో 736 ప‌రుగులు చేశాడు. ఇక 139 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 22.60 స‌గ‌టుతో 2848 ప‌రుగులు చేశాడు. 2018లో టీమ్ఇండియా త‌రుపున చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడిన పార్థివ్ 2020లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.