Harbhajan Singh : భ‌జ్జీ ఎంత ప‌ని జేస్తివి.. పాక్ ఆట‌గాడితో.. వీడియో వైర‌ల్‌..

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ (Harbhajan Singh) చేసిన ప‌నికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Harbhajan Singh : భ‌జ్జీ ఎంత ప‌ని జేస్తివి.. పాక్ ఆట‌గాడితో.. వీడియో వైర‌ల్‌..

Abu Dhabi T10 League Harbhajan Singh Ditches No Handshake Policy

Updated On : November 20, 2025 / 12:28 PM IST

Harbhajan Singh : ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌రువాత భార‌త్, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌లు జ‌రిగినప్ప‌డు పాక్ ఆట‌గాళ్ల‌తో భార‌త ప్లేయ‌ర్లు క‌ర‌చాల‌నం చేయ‌డం లేని సంగ‌తి తెలిసిందే. భార‌త పురుష జ‌ట్టుతో పాటు మ‌హిళ‌ల జ‌ట్టు కూడా ఇదే విధానాన్ని అనుస‌రిస్తోంది. అయితే.. తాజాగా టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇందుకు విరుద్దంగా ప్ర‌వ‌ర్తించాడు. అత‌డు పాక్ ఆట‌గాడు షానవాజ్ దహానీకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ ఘ‌ట‌న అబుదాబి టీ10 లీగ్‌లో చోటు చేసుకుంది.

అబుదాబీ టీ10 లీగ్‌లో హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా నార్త‌ర్న్ వారియ‌ర్స్‌తో ఆస్పిన్ స్టాలియన్స్ జ‌ట్ల మ‌ధ్య బుధ‌వారం మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో నార్త‌ర్న్ తొలుత బ్యాటింగ్ చేసి 115 ప‌రుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ త‌రువాత ఛేద‌న‌లో భ‌జ్జీ సార‌థ్యంలో ఆస్పిన్ స్టాలియన్స్ జ‌ట్టు 110 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మై నాలుగు ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

IND vs SA : కోచ్ అంటే నేర్పించాలి గానీ.. బ్యాట‌ర్ల‌ను బాధ్యుల‌ని చేస్తావా? గంభీర్ పై మాజీ ప్లేయ‌ర్ ఆగ్ర‌హం

ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం హర్భజన్ నార్తర్న్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాకిస్తాన్ బౌలర్ షాహనవాజ్ దహానీతో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో భ‌జ్జీ పై నెటీజ‌న్లు మండిపడుతున్నారు.

IND vs PAK : ఇదేం ట్విస్ట్ సామీ.. భారత్, పాక్ మ్యాచ్ లేకుండానే వరల్డ్ కప్ షెడ్యూల్.. రిలీజ్ చేసిన ఐసీసీ

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లను యువరాజ్‌ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇండియా లెజెండ్స్ జ‌ట్టులో హ‌ర్భ‌జ‌న్ సింగ్ కూడా భాగంగా ఉన్నాడు.