Pro Panja League: జూలై 28 నుంచి ప్రో పంజా లీగ్.. స‌త్తా చాటేందుకు సిద్ద‌మైన కిరాక్ హైదరాబాద్

ప్రొఫెషనల్ ఆర్మ్ రెజ్లింగ్ క్రీడను లీగ్‌గా పరిచయం చేస్తూ ప్రో పంజా లీగ్ సీజ‌న్ 1 జూలై 28 నుంచి ప్రారంభ‌కానుంది.

Pro Panja League

Pro Panja League 2023: క్రికెట్‌లో ఐపీఎల్(IPL) లాగానే ప్ర‌స్తుతం చాలా క్రీడ‌ల్లో లీగులు ప్రారంభం అవుతున్నాయి. ప్రొఫెషనల్ ఆర్మ్ రెజ్లింగ్ క్రీడను లీగ్‌గా పరిచయం చేస్తూ ప్రో పంజా లీగ్(Pro Panja League) సీజ‌న్ 1 జూలై 28 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 17 రోజుల పాటు అంటే ఆగ‌స్టు 13 వ‌ర‌కు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నీని నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పాల్గొనే జ‌ట్ల‌లో తెలుగు ప్రాంఛైజీ అయిన కిరాక్ హైద‌రాబాద్(Kirak Hyderabad) ఒక‌టి.

లీగ్‌లో భాగ‌స్వామ్యం కావ‌డానికి, పెట్టుబ‌డులు పెట్ట‌డానికి గ‌ల కార‌ణాల‌ను అలాగే ఆర్మ్‌రెజ్లింగ్ ఆట చరిత్రను కిరాక్ హైదరాబాద్ యజమాని, గౌతమ్ రెడ్డి వెల్ల‌డించారు. హైదరాబాద్‌లో ఆర్మ్ రెజ్లింగ్ కు గొప్ప చరిత్ర ఉందనే విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చున‌న్నారు. అనేక జాతీయ టోర్నమెంట్‌లు సిటీలో జరుగుతున్నాయని, ఇక్కడ ఆర్మ్‌రెజ్లింగ్ ప్రతిభకు కొరత లేదన్నారు. స్థానికంగా ఉన్న క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని అనుకున్న‌ట్లు చెప్పారు. పంజా ప్రాంతీయ క్రీడ మాత్రమే కాదని, భారతదేశం అంతటా మూలాలను కలిగి ఉన్న స్థానిక క్రీడ అని చెప్పుకొచ్చారు. ఈ గేమ్‌ను ప్రోత్సహించే అవకాశాన్ని కోల్పోదలచుకోలేదని, అందుకే ప్రో పంజా లీగ్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుని, భాగస్వామి అయిన‌ట్లు వెల్ల‌డించారు.

Premier Handball League: తెలుగు టాల‌న్స్‌కు భారీ షాక్‌.. ఈ సీజ‌న్‌లో తొలిసారి

ప్రొ పంజా లీగ్ లో కిరాక్ హైదరాబాద్ జట్టు చేరినందుకు ప్రో పంజా లీగ్ సహ వ్యవస్థాపకులు పర్విన్ దాబాస్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. మొద‌టి సీజ‌న్‌లో జ‌ట్టు గొప్ప ప్ర‌ద‌ర్శ‌న చేస్తార‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. దేశంలో ఉన్న ఆర్మ్ రెజ్ల‌ర్ల‌కు మంచి ప్లాట్ ఫార్మ్ ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతో ఈ లీగ్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు చెప్పారు. ఆర్మ్ రెజ్లింగ్ క్రీడ దేశ ప్రేక్ష‌కుల మ‌న‌స్త‌త్వానికి స‌రిపోయే పోరాట క్రీడ అని, ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఈ ఆట‌కు భారీ ఫాలోయింగ్ ఉన్న‌ట్లు తెలిపారు.

ప్రీతి ఝాంగియాని ప్రో పంజా లీగ్ మ‌రో సహ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. ఆర్మ్ రెజ్లింగ్ అంద‌రికి తెలిసిన ఆటేన‌ని అన్నారు. అలాంటి క్రీడకు అవసరమైన ప్రాచుర్యాన్ని అందించాలన్న ప్రాథమిక లక్ష్యంతోనే పంజా లీగ్‌ను ప్రారంభించాలని అనుకున్నట్లు చెప్పారు. లీగ్‌ కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కష్టపడి మేము సృష్టించిన దాన్ని ప్రేక్షకులకు చూపించడానికి వేచి ఉండలేకపోతున్నామ‌ని చెప్పుకొచ్చారు.

Global Chess League: చెస్ క్రీడా ప్ర‌పంచంలో ఉన్న అంత‌రాల‌ను తొల‌గించేందుకు.. గ్లోబ‌ల్ చెస్ లీగ్ వ‌చ్చేస్తుంది

ట్రెండింగ్ వార్తలు