ఆ రెండింటీని కలిపి చూడలేదు: పాక్ క్రికెటర్ల ఫొటోలను తొలగించడంపై ప్రధాని స్పందన

పుల్వామా దాడిలో జరిగిన బీభత్సానికి నిరసనగా మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం పాక్ క్రికెటర్ల ఫొటోలను తొలగించింది. దిగ్గజ క్రికెటర్ల ఫొటోలను మొహాలీ స్టేడియంలో ఉంచడం సంప్రదాయంగా వస్తుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఇమ్రాన్ ఫొటోకు ముసుగు కప్పి ఉంచగా మొహాలీలో మాత్రం పాక్‌కు సంబంధించిన క్రికెటర్లందరి ఫొటోలను తొలగించారు. దీనిపి పాక్ ప్రధానిగా నియమితులైన  ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఇలా స్పందించారు. 

‘పాకిస్తాన్.. క్రీడలు, రాజకీయాలను ఎప్పుడూ కలిపి చూడలేదు. ముఖ్యంగా క్రికెట్‌ను ఎంతో ప్రత్యేకంగా చూస్తోంది. ఎందుకంటే ఇరు దేశాల మధ్య సంబంధాలకు క్రికెట్ కీలకంగా వ్యవహరించింది. లెజెండరీ క్రికెటర్ల ఫొటోలు తొలగించడమనేది సబబు కాదు’ అని పేర్కొన్నాడు. 

ఈ ఉగ్రదాడిలో 49వరకూ జవాన్లు అమరులైయ్యారు. ఈ దాడిలో పాల్గొన్నది పాక్ ఉగ్రవాదులే అని స్పష్టమైనా.. ఆ దేశం ఏమం మాత్రం విరుద్ధంగా స్పందించకపోవడం భారతీయులలో వ్యతిరేకత చూపించేలా చేసింది. ఈ కారణంతోనే పాక్.. మొత్తాన్ని ద్వేషించేందుకు కారణమవుతోంది. ఈ మేర పాకిస్తాన్ దేశీవాలీ లీగ్ అయిన పీఎస్ఎల్ ప్రసారాలను సైతం భారత్‌లో ప్రసారం చేయమంటూ ఐఎంజీ రిలయన్స్ సంస్థ ప్రకటించింది.