Site icon 10TV Telugu

Viral Cricket Videos : ఏంటి మామ ఇదీ.. ఔటా? నాటౌటా? చెబితే మీరు తోపులే..

Punjab Kings Shares cricket puzzle video

Punjab Kings Shares cricket puzzle video

Viral Cricket Videos: సోష‌ల్ మీడియాలో క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద ప‌జిల్‌గా మారింది. ఈ వీడియోలో బ్యాట‌ర్ ఔట్ అయ్యాడా? లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

ఈ వీడియోను ఐపీఎల్ టీమ్ అయిన పంజాబ్ కింగ్స్ త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఓ టెన్నిస్ బాల్ టోర్నీకి సంబంధించిన‌దిగా తెలుస్తోంది. ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఓ ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు బంతిని ఎదుర్కొనే క్ర‌మంలో క్రీజులోప‌లికి వెళ్లాడు. భారీ షాట్ కొట్టేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. బాల్ అత‌డి బ్యాట్‌ను త‌గ‌లలేదు. వికెట్ కీప‌ర్ దిశ‌గా వెళ్లింది.

Virat Kohli : తెల్ల గ‌డ్డంతో క‌నిపించిన కింగ్ కోహ్లీ.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌.. ‘వన్డే రిటైర్మెంట్ లోడింగ్..’

అయితే.. స‌ద‌రు బ్యాట‌ర్ బంతిని మిస్ చేశాన‌న్న బాధ‌లో బ్యాట్‌తో త‌న త‌ల‌పై ఉన్న టోఫీని కొడ‌తాడు. అయితే.. ఆ క్యాప్ కాస్త వికెట్ల మీడ ప‌డి బెయిల్స్ కింద‌ప‌డ్డాయి. దీంతో ఫీల్డింగ్ టీమ్ ఔట్ అంటూ అప్పీల్ చేయ‌గా.. లెగ్ సైడ్‌లో ఉన్న అంపైర్‌తో స‌ద‌రు బ్యాట‌ర్ తాను వికెట్లను ప‌డ‌గొట్ట‌లేద‌ని, క్యాప్ వ‌ల్లే ప‌డింది అంటూ చెబుతున్నాడు.

Virat Kohli-Rohit Sharma : కోహ్లీ, రోహిత్‌ల 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ క‌ల చెద‌ర‌నుందా?

ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ పంజాబ్ కింగ్స్ ఔటా? నాటౌటా? అని అడిగింది. దీనిపై నెటిజ‌న్లు రెండుగా విడిపోయారు. కొంద‌రు నాటౌట్ అని అంటుంటే ఇంకొంద‌రు మాత్రం ఔట్ అని అంటున్నారు. బ్యాట‌ర్ హెల్మెట్ వికెట్ల ప‌డి బెయిల్స్ కింద ప‌డ‌డంతో ఔటైన సంద‌ర్భాల‌ను ఊదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. మరి మ‌రేంమంటారు ఔటా? నాటౌటా?

Exit mobile version