Virat Kohli : తెల్ల గడ్డంతో కనిపించిన కింగ్ కోహ్లీ.. ఆందోళనలో ఫ్యాన్స్.. ‘వన్డే రిటైర్మెంట్ లోడింగ్..’
తాజాగా ఓ అభిమాని కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Kohli with grey beard in viral photo fans worry ODI retirement loading
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఫోటోలో కోహ్లీని చూసిన అందరూ షాక్ అవుతున్నారు. ఇందులో కోహ్లీ తెల్ల గడ్డంతో కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక వన్డేలకు కూడా అతడు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెల్ల గడ్డం, రిటైర్‌మెంట్ కు సంబంధం ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు. జూలై 10న ఇంగ్లాండ్‌లో యువరాజ్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో కోహ్లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్ రిటైర్‌మెంట్ గురించి ప్రస్తావించాడు. రెండు రోజుల క్రితమే నా గడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మీ గడ్డానికి రంగు వేసుకుంటున్నారంటే ఆ సమయం వచ్చిందని అర్థం అని కోహ్లీ అన్నాడు.
Virat Kohli-Rohit Sharma : కోహ్లీ, రోహిత్‌ల 2027 వన్డే ప్రపంచకప్ కల చెదరనుందా?
Virat Kohli with Shash Kiran in the UK. pic.twitter.com/Y9JoWrO1Gl
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2025
తనకు తెల్లగడ్డం కూడా వచ్చిందని, ఇంకా ఎన్నాళ్లు టెస్టులు ఆడమని అంటారని కోహ్లీ అనడంతో అన్నడ నవ్వులు విరిసాయి. కోహ్లీ అప్పుడు చేసిన ఈ వ్యాఖ్యల కారణంగానే ప్రస్తుతం అతడు తెల్లగడ్డంతో కనబడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వన్డే రిటైర్మెంట్ లోడింగ్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ఇండియా విజయం సాధించిన వెంటనే కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో టెస్టులకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కాగా.. టీమ్ఇండియా ఇప్పట్లో వన్డేలు ఆడదు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో మాత్రమే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తోసిరీస్ కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
He didn’t even colour his beard now. ODI retirement loading !!
— The last dance (@26lastdance) August 8, 2025