PV Sindhu: విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు భూమిపూజ.. ఫొటోలు వైరల్

విశాఖపట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి పీవీ సింధూ భూమిపూజ చేశారు

PV Sindhu

PV Sindhu Badminton Academy Visakhapatnam: విశాఖపట్టణంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి పీవీ సింధూ భూమిపూజ చేశారు. విశాఖలోని పెద గదిలి కూడలి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి తల్లిదండ్రులతో కలిసి పీవీ సింధూ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధూ మాట్లాడుతూ.. పనులు వేగవంతంగా చేసి ఏడాదిలోగా అకాడమీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Also Read: పవర్‌లో ఉన్నా ఎందుకీ దూకుడు? అసలు పవన్ కల్యాణ్ వ్యూహం ఏంటి..

విశాఖపట్టణంలో బ్యాడ్మింటన్ పై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువత ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, అకాడమీ సామర్థ్యం, శిక్షణ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తానని పీవీ సింధూ తెలిపారు. ఇదిలా ఉంటే భూమిపూజకు సంబంధించిన ఫొటోలను పీవీ సింధూ తన ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.