పీవీ సింధు.. కనీస పోరాటం కూడా జరపకుండానే టోర్నీ నుంచి తప్పుకుంది.
పీవీ సింధు.. కనీస పోరాటం కూడా జరపకుండానే టోర్నీ నుంచి తప్పుకుంది. ఫిట్‌నెస్‌తో సతమతమవుతోన్న సింధు గతంలో రెండు సార్లు ఇదే టోర్నీలో ఓడించిన జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో పోటీ ఇవ్వలేకపోయింది. ఈ కారణంగా సెమీ ఫైనల్స్ బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
Read Also : IPL 2019: బెంగళూరు ప్లేఆఫ్‌కు వెళ్లగలదు
సింగపూర్ ఓపెన్‌లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆరంభం నుంచి తడబడిన సింధు.. 7-21, 11-21 ఒకుహర చేతిలో ఓడిపోయింది. ఇప్పటివరకూ ఒకుహరతో సింధు 6 సార్లు ఆడగా 4 సార్లు విజయాన్ని దక్కించుకోంది. జరిగిన 15నిమిషాల గేమ్ లో సింధు.. పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించలేదు.
సింధూ.. ఈ గేమ్ కోల్పోవడానికి ఆమె వరుస తప్పిదాలే కారణం. పదే పదే లైన్ దాటి వెళ్లడం, తరచూ నెట్ దగ్గరకు వెళ్తుండటం ఆమె కొంపముంచాయి. కానీ, ఒకుహర అలాంటి పొరబాట్లకు తావివ్వకుండా ఓపికగా గేమ్ ను చేజిక్కుంచుకుంది. ఆరంభంలో కాస్త తడబడినా క్రమంగా ఊపందుకుని గేమ్ చేజిక్కించుకుంది.
Read Also : RRvMI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్