×
Ad

PV Sindhu : పీవీ సింధు ఓటమి… అయినా పతకం

ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఉన్న Muntinlupa Sports Complexలో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాప్ సీడ్ క్రీడాకారిణి అకానె యమగూచి (జపాన్)తో తలపడింది...

  • Published On : April 30, 2022 / 01:57 PM IST

Pv Sindhu

PV Sindhu : ప్రపంచ బ్యాడ్మింటెన్ లోని ఆసియా ఛాంపియన్ షిప్ లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. సెమీస్ లో ఆమె పరాజయం పాలైంది. అయినా.. పతకం మాత్రం సాధించారు. మెరుగైన ఆట తీరుతో సెమీస్ చేరుకున్న సింధు.. ఫైనల్ కు చేరుకుంటుందని క్రీడాభిమానులు భావించారు. కానీ.. ప్రత్యర్థి యమగూచి సింధు ఆటను సాగనివ్వలేదు. వరుసగా మూడు గేమ్ లలో రాణించకపోవడంతో సింధు.. ఓటమి పాలైంది. కోవిడ్ కారణంగా.. రెండు సంవత్సరాల తర్వాత.. ఈ టోర్నీ జరిగింది.

Read More : PV Sindhu : సెమీస్‌కు సింధు.. మెడల్ ఖాయం..!

ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు.. జైత్రయాత్ర కొనసాగింది. సెమీస్ లోకి అడుగు పెట్టింది. 2022, ఏప్రిల్ 30వ తేదీ శనివారం ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఉన్న Muntinlupa Sports Complexలో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాప్ సీడ్ క్రీడాకారిణి అకానె యమగూచి (జపాన్)తో తలపడింది. ఓపెనింగ్ గేమ్ ను 21-13 తేడాతో సింధు కైవసం చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. రెండో గేమ్ లో 13-11తో ఆధిక్యంలో దూసుకెళ్లింది.

Read More : PV Sindhu : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్.. ఫైనల్లో పీవీ సింధు, ప్రణయ్

సమయం వృథా చేయడంతో ఒక పాయింట్ పెనాల్టీ విధించారు. ఇది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ప్రత్యర్థి యమగూచి రెచ్చిపోయి ఆడారు. దీంతో సింధు ఆటలు సాగలేదు. వరుసగా రెండు సెట్లను సింధు కోల్పోయింది. చివరకు 21-13, 19-21, 16-21 తేడాతో సింధు పరాజయం చెందింది. కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆసియా ఛాంపియన్ షిప్ టోర్నీలో సింధూకు ఇది రెండో పతకం కావడం విశేషం. గతంలో ఈ పోటీలో సైనా నెహ్వాల్ మూడుసార్లు కాంస్యంతోనే సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.