Tokyo Olympics 2020 : ఓటమిపై స్పందించిన పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత పీవీ సింధు బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ వర్గాలతో మాట్లాడారు.. ‘‘సెమీ ఫైనల్‌లో ఓడినందుకు బాధగానే ఉందని తెలిపారు. తన శక్తిమేరకు పోరాడానని కానీ ఈ రోజు తనది కాకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.

Tokyo Olympics 2020 (6)

Tokyo Olympics 2020 : టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత పీవీ సింధు బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ వర్గాలతో మాట్లాడారు.. ‘‘సెమీ ఫైనల్‌లో ఓడినందుకు బాధగానే ఉందని తెలిపారు. తన శక్తిమేరకు పోరాడానని కానీ ఈ రోజు తనది కాకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. తన బలబలాను అంచనా వేసే బరిలోకి దిగాను. కానీ తైజుయింగ్‌ తనపై పైచేయి సాధించిందని పేర్కొన్నారు.

భారతీయ అభిమానులు నాకు మద్దతుగా నిలిచారు. ఫైనల్‌కు వెళ్లనందుకు బాధగానేఉంది. కానీ కాంస్య పతకానికి అవకాశం ఉంది. అందులో విజయం సాధించి పతకం తీసుకొస్తానని దీమా వ్యక్తం చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌ లో శనివారం జరిగిన సెమీస్‌లో వరల్డ్ నెంబర్ వన్ చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్‌ తో తలపడిన సింధు ఓటమి చవిచూశారు. మొదటి సెట్ హోరాహోరీగా సాగింది. మొదటి సెట్ సింధు కైవసం చేసుకుంటుందని అందరు భావించారు.. కానీ తైజుయింగ్‌ అనూహ్యంగా పంచుకుంది.. దీంతో ఆమె ఫస్ట్ సెట్ కోల్పోయింది.

ఇక రెండో సెట్లో తైజుయింగ్‌ ఎదురుదాడికి దిగడంతో రెండోసెట్లో కూడా సింధు వెనకబడింది. దీంతో వరసగా రెండు సెట్లలో విజయం సాధించి.. మ్యాచ్ ని గెలిచారు తైజుయింగ్‌. ఈ మ్యాచ్ లో 18-21, 12-21తో చైనా క్రీడాకారిణి తైజుయింగ్‌ విజయం సాధించి ఫైనల్ కి చేరింది. ఇక సింధు కాంస్యపతక పోరు రేపు జరగనుంది. ఈ పోరులో ఆమె గెలిస్తే కాంస్యం లభిస్తుంది.