PV Sindhu : ఆపిల్ సీఈవో టిమ్‌కుక్‌తో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ సెల్ఫీ.. వైర‌ల్‌

అమెరికా టెక్ దిగ్గ‌జం ఆపిల్ త‌న కొత్త ఐఫోన్‌ల‌ను మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించింది. యూఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) కూడా ఇందులో పాల్గొంది.

Sindhu selfie with Tim Cook

PV Sindhu-Tim Cook : అమెరికా టెక్ దిగ్గ‌జం ఆపిల్ త‌న కొత్త ఐఫోన్‌ల‌ను మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించింది. యూఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) కూడా ఇందులో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ (Tim Cook)తో క‌లిసి సింధు సెల్ఫీని దిగింది. ఈ పిక్‌ను త‌న సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది.

‘యాపిల్ కుపెర్టినోలో కినోట్ రోజున టిమ్ కుక్‌ను క‌లుసుకున్నా. ఇది మ‌రుపురాని క్ష‌ణం. టీమ్‌.. అద్భుమైన ఆఫిల్ పార్క్‌ను చూడ‌డం.. మిమ్మ‌ల్ని క‌ల‌సుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది.’ అంటూ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పీవీ సింధు రాసుకొచ్చింది. ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నెటీజ‌న్లు లైకులు, కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు.

Asia Cup 2023 : స్టేడియంలో కొట్టుకున్న భార‌త్, శ్రీలంక ఫ్యాన్స్‌..!

ఈ ఈవెంట్‌లో ఆపిల్ కంపెనీ 4 కొత్త ఐఫోన్‌లను iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max ల‌ను పరిచయం చేసింది. వీటితో పాటు వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2 వాచీల‌ను కూడా ఆపిల్ లాంచ్ చేసింది. iPhone 15 ప్రారంభ ధర రూ. 79,900 కాగా, iPhone 15 Plus ప్రారంభ ధర రూ. 89,900, ఈ రెండు ఫోన్లు కూడా 128GB స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లు సెప్టెంబర్ 15 నుండి ప్రీఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 22 నుండి విక్ర‌యాలు ప్రారంభం కానున్నాయి. iPhone 15 Pro 128GB స్టోరేజ్ స‌పోర్టుతో వ‌స్తోంది. దీని ప్రారంభ ధ‌ర రూ.1,34,900. 1 టీబీ iPhone 15 Pro మోడల్ ధర రూ.1,84,900గా ఉంది.

Virat Kohli : పాకిస్తాన్ పై రికార్డు బ్రేక్ ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ వైరల్..!

సీ పోర్ట్ తో చార్జింగ్..

తొలిసారి USB టైప్-C పోర్ట్‌ చార్జింగ్ తో ఐఫోన్లను తయారు చేశారు. యూరోపియన్ యూనియన్ ఆదేశాలతో దిగి వచ్చిన యాపిల్ సంస్థ ఎట్టకేలకు సీ పోర్ట్ చార్జింగ్ తో ఐఫోన్లను రిలీజ్ చేసింది. అయితే యూజర్లు తమ ఎయిర్‌పాడ్‌లు తాజా ఐఫోన్‌ల మాదిరిగానే అదే కనెక్టర్‌ కావాలనుకుంటే మాత్రం కొత్త పెయిర్ కోసం 249 డాలర్లు(రూ. 20650) వెచ్చించాల్సి ఉంటుంది. పాత లైట్నింగ్ ఛార్జర్‌లను ఉపయోగించాలనుకుంటే 29 డాలర్లతో (రూ. 2405) Apple నుండి అడాప్టర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.