Rafael Nadal Career Ends As Netherlands Defeat Spain In Davis Cup
దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. ఇక పై అతడిని టెన్నిస్ కోర్టులో చూడలేదు. నాదల్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడు. తన కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న ఈ దిగ్గజ ఆటగాడు ఆఖరి మ్యాచ్‌లో ఓటమితో వీడ్కోలు పలికాడు. డేవిస్ కప్ క్వార్టర్స్ ఫైనల్‌లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ ఓడిపోవడంతో అతడి కెరీర్ ముగిసింది. డేవిస్ కప్‌తో ఆటకు వీడ్కోలు పలుకుతానని అక్టోబర్‌లోనే నాదల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. డేవిస్ కప్‌లో ఓటమితోనే సుదీర్ఘ కెరీర్‌ను ఆరంభించిన నాదల్ పరాజయంతోనే తన కెరీర్‌ను ముగించడం గమనార్హం.
సింగిల్ మ్యాచ్‌లో బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్ (నెదర్లాండ్స్) చేతిలో నాదల్ 4-6, 4-6 తేడాతో ఓడిపోయాడు. అయితే.. కార్లోస్ అల్కరాజ్ 7-6 (7/0), 6-3తో టాలోన్ గ్రీక్స్‌పూర్‌ను ఓడించాడు. దీంతో 1-1తో స్పెయిన్, నెదర్లాండ్స్ సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక డబుల్స్‌లో అల్కారజ్, మార్సెల్ గ్రానోల్లర్స్ ఓడిపోయారు. దీంతో నెదర్లాండ్స్ 2-1 తేడాతో సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.
Sachin Tendulkar : భార్య అంజలి, కూతురు సారాతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్.. వీడియో
డబుల్స్ మ్యాచ్‌లో స్పెయిన్ గెలిచి ఉంటే.. సెమీఫైనల్‌లో నాదల్ ఆటను చూసి ఉండేవాళ్లం. కానీ ఓడిపోవడంతో నాదల్ కెరీర్ ఇక్కడితోనే ముగిసింది.
కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు నాదల్. ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మూడింట పాల్గొనలేదు. డేవిస్ కప్‌కు ముందు చివరగా పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన నాదల్ నిరాశపరిచాడు. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్, రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో ఛాంపియన్‌గా నిలిచాడు.