Raj Kundra Arrest
Raj Kundra Arrest : ప్రముఖ నటి శిల్పశెట్టో భర్త రాజ్ కుంద్రా ఫోర్నోగ్రఫీ సంబందించిన కేసులో అరెస్టైన విషయం విదితమే.. ఈ నెల 23 వరకు కుంద్రా పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే క్రికెటర్ అజింక్యా రహానే, రాజ్ కుంద్రాల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. 2012లో రహానే రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతుండగా రాజ్ కుంద్రాను మెచ్చుకుంటూ ఓ ట్వీట్ చేశారు. ”రాజ్ కుంద్రా మీరు చాలా గ్రేట్ జాబ్ చేస్తున్నారు.. ఇలాగే కొనసాగించండి.” అంటూ పేర్కొన్నాడు.
ఇక అప్పుడు రాజస్థాన్ జట్టు సహా వ్యవస్థాపకుడిగా ఉన్న కుంద్రా ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. ” థ్యాంక్యూ సో మచ్ రహానే.. నేను చేసే పనిని నువ్వు కచ్చితంగా లైవ్‌లో చూడాలి” అంటూ సమాధానం ఇచ్చాడు. దానికి రహానే ” తప్పకుండా వస్తాను సార్” అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే గతంలో వీరిమధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి సరైన సమాచారం లేదు.. కానీ తాజాగా రాజ్ కుంద్రా ఫోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో ఈ విషయంపైనే వారు మాట్లాడి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరికొందరు మాత్రం రహానేని సమర్థిస్తున్నారు. అతడు ఎటువంటి వివాదాలు లేకుండా పదేళ్లుగా క్రికెట్లో కొనసాగుతున్నారని, వారి సంభాషణ వేరే విషయంపై జరిగి ఉండొచ్చని చెపుతున్నారు. ఏది ఏమైనా ఈ ట్విట్ మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వీరి సంభాషణ రహానేను చిక్కుల్లో ప్రదేశాల కనిపిస్తుంది.
మరోవైపు ఈ కేసులో సరైన ఆధారాల కోసం పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. రాజ్ కుంద్రాతోపాటు మరికొందరు ఉన్నట్లు పోలీసులు గురించారు. వారిని కూడా అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ కేసు విషయంలో రాజ్ కుంద్రాతోపాటు మరో 11 మంది పోలీసుల అదుపులో ఉన్నారు.
@TheRajKundra Sir you are doing a Great job..
— Ajinkya Rahane (@ajinkyarahane88) October 19, 2012
@TheRajKundra yeah I wil for sure sir:)
— Ajinkya Rahane (@ajinkyarahane88) October 19, 2012