Rahim Shakib break Sachin Sehwag record
World Cup 2023 BAN vs NZ : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో రికార్డులు బద్దలు అవుతూనే ఉన్నాయి. తాజాగా భారత దిగ్గజ జోడి సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ ల పేరిట ఉన్న రికార్డును బంగ్లాదేశ్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీమ్- షకీబ్ అల్ హసన్ ల జోడి బ్రేక్ చేసింది. చెన్నైలోని చెపాక్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లు ఈ ఘనత సాధించారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సీనియర్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీమ్(66), షకిబ్ అల్ హాసన్(40)లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టును గౌరవప్రదమైన స్కోరును అందించారు. ఈ క్రమంలోనే సచిన్-సెహ్వాగ్ ల జోడి నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించారు.
భాగస్వామ్య రికార్డు..
వన్డే ప్రపంచకప్ చరిత్రలో సచిన్-సెహ్వాగ్ లు 20 ఇన్నింగ్స్‌లలో 971 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా, తాజాగా బంగ్లాదేశ్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్- షకీబ్ అల్ హసన్ 19 ఇన్నింగ్స్‌ల్లో 972 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి సచిన్,సెహ్వాగ్ జోడి రికార్డును బ్రేక్ చేశారు. ఈ జాబితాలో ఆసీస్ విధ్వంసకర జోడి మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ల జోడీ మొదటి స్థానంలో ఉంది. హేడెన్-గిల్‌క్రిస్ట్‌లు 20 ఇన్నింగ్స్‌ల్లో 1,220 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Olympics : ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఐఓసీ గ్రీన్ సిగ్నల్.. ఆ ఒక్కటి పూర్తి అయితే..
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన జోడీలు..
మాథ్యూ హేడెన్- ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 20 ఇన్నింగ్స్‌లలో 1,220 పరుగులు
ముష్ఫికర్ రహీమ్ -షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 19 ఇన్నింగ్స్‌లలో 972 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండూల్కర్ (ఇండియా) – 20 ఇన్నింగ్స్‌లలో 971 పరుగులు
మార్టిన్ గప్టిల్- బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) – 17 ఇన్నింగ్స్‌లలో 838 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (66), షకీబ్ (40), మహ్మదుల్లా (41), హసన్ మిరాజ్ (30) లు రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ మూడు వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, హెన్రీ రెండేసి వికెట్లు తీశారు. మిచెల్ సాంట్నర్, ఫిలిప్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
IND vs PAK : బాయ్‌కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. జవాన్ల ప్రాణాలు పోతుంటే..?