Rahul Dravid : రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందే ద్రవిడ్ (Rahul Dravid) ఫ్రాంచైజీతో తన పదవీకాలాన్ని ముగించనున్నట్లు పక్రటించింది. ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది.
‘రాయల్స్ ప్రయాణంలో రాహుల్ చాలా సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించాడు. అతని నాయకత్వం ఒక తరం ఆటగాళ్లను ప్రభావితం చేసింది. జట్టులో బలమైన విలువలను నిర్మించింది. ఫ్రాంచైజీ సంస్కృతిపై చెరగని ముద్ర వేసింది. జట్టు నిర్మాణంలో భాగంగా రాహుల్‌కు మరో పదవిని ఫ్రాంఛైజీ ఆఫర్ చేసింది. కానీ ఆయన దానిని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. రాజస్థాన్ రాయల్స్, ఆటగాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తరుపున రాహుల్ ద్రవిడ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు.’అని ఆర్ ఆర్ తెలిపింది.
Official Statement pic.twitter.com/qyHYVLVewz
— Rajasthan Royals (@rajasthanroyals) August 30, 2025
కాగా.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫ్రాంఛైజీని విడిచిపెట్టబోతున్నాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ద్రవిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.