Rahuo Dravid
Rahul Dravid: టీమిండియా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్.. మరొ కొద్ది రోజుల్లో జరగబోయే లంక పర్యటనకు ప్రధాన కోచ్ గా వ్యవహరించనున్నారు. ఆరు మ్యాచ్ ల పరిమిత ఓవర్ల ఫార్మాట్ జులైలో జరగనుంది. జులై రెండో భాగంలో మూడు టీ20లు, చాలా వన్డేలు జరుగుతాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సారథ్యంలో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగుతుంది.
కోచింగ్ స్టాఫ్ యూకేలో ఉండనున్నారు. రాహుల్ ద్రవిడ్ గైడెన్స్ లో టీం నడుస్తోంది. ద్రవిడ్ ఇండియా ఏ జట్టుకు కోచ్ గా ఆల్రెడీ వ్యవహరించారు. వారితో కలిసి కంఫర్టబుల్ గానే ఉంటాడని బీసీసీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు.
2014లో బ్యాటింగ్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన తర్వాత ద్రవిడ్ కు లంక పర్యటనలో నిరూపించుకోవడం రెండో అవకాశం. నేషనల్ క్రికెట్ అకాడమీకి 2019లో హెడ్ గా వ్యవహరించకముందే అండర్ 19 జట్టుకు, ఇండియా ఏ జట్టుకు కోచ్ గా వ్యవహరించారు ద్రవిడ్.
జూన్ చివరి నాటికి లంక పర్యటనకు వెళ్లనున్న ఇండియా బృందాన్ని ఎంపిక చేయనుంది సెలక్షన్ కమిటీ. జులై 13, 16, 19లలో వన్డేలు జరగనుండగా జులై 22 నుంచి 27తేదీల మధ్యలో టీ20లు నిర్వహిస్తారు.