ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ధనిక లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ మరో సీజన్‌కు సిద్ధమైపోతుంది. ముందుగా తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న జట్లు, జట్ల పేర్ల మార్పు, జెర్సీల్లో మార్పులు చేసుకుని సరికొత్త హంగుల్తో ఐపీఎల్ 2019కి ముస్తాబవుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పేరు మార్చుకుని ఢిల్లీ క్యాపిటల్స్ కాగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు జెర్సీ రంగు మార్చుకుని పింక్ కలర్ దుస్తుల్లో కనిపించనుంది.
రెండేళ్ల పాటు నిషేదం అనుభవించి 2018సీజన్లో పున:ప్రవేశం చేసిన రాజస్థాన్ తొమ్మిది సీజన్ల వరకూ బ్లూ కలర్ జెర్సీతోనే కనిపించింది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింకా రహానె, బ్రాండ్ అంబాసిడర్ షేన్ వార్న్‌లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేర గతేడాది ఒక మ్యాచ్‌లో క్యాన్సర్‌పై అవగాహన కోసం పింక్ కలర్ దుస్తుల్లో కనిపించింది. దానికి వచ్చిన స్పందనను బట్టి తమ జట్టు పింక్ కలర్‌లో కనిపిస్తే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ రహానె పేర్కొన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అధికారిక ట్విట్టర్ ద్వారా జెర్సీతో ఉన్న వీడియోను పంచుకుంది. ‘జైపూర్ అంటేనే పింక్ సిటీగా పేరు. అందుకే మేం పింక్‍లో కనిపించాలనుకుంటున్నాం. పింక్ కలర్ ధరించేందుకు ఆటగాళ్లు సంతృప్తిగా కనిపిస్తున్నారు. ఈ ఏడాది పింక్‌లో అదరగొట్టేందుకు జట్టు సిద్ధమవుతోంది’ అని జట్టు అంబాసిడర్ అయిన షేన్ వార్న్ తెలిపాడు.
Meet the Pink Diamonds of Cricket! Meet the new Rajasthan Royals. ?#HallaBol pic.twitter.com/3rGPOl7gM5
— Rajasthan Royals (@rajasthanroyals) February 10, 2019
గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సైతం పేరు మార్చుకునేందుకు ప్రయత్నాలు చేసి మానుకుంది. ఆ తర్వాత ఆ జట్టు నుంచి వీరేందర్ సెహ్వాగ్ తప్పుకోవడంతో మేనేజ్‌మెంట్‌లో మార్పులొచ్చాయి.