ఐపీఎల్-13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెన్నై బౌలర్లకు చెమటలు పట్టించాడు.
యశస్వి జైస్వాల్(6) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. ఆది నుంచి నిలకడగా ఆడుతూ రాజస్థాన్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.
సిక్సర్ల మోత మోగించి 19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ సాధించాడు.
పీయూష్ చావ్లా వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో నాలుగు భారీ సిక్స్‌లతో వారెవా శాంసన్ అనిపించాడు.
శాంసన్ తో పాటు స్టీవ్ స్మిత్ కూడా అదే దూకుడుతో ఆడాడు.. స్మిత్, శాంసన్ కలిసి చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు.
స్మిత్ (47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ ) 69 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
శాంసన్ కూడా అదే దూకుడుతో 32 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్స్ లు కొట్టి 74 పరుగులతో హాప్ సెంచరీ దాటేశాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ ఖాతానే తెరవలేదు.
ఉతప్ప (5), పరాగ్ (6), జైశ్వాల్ (6) సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా.. రాహుల్ తివాతియా (10), టామ్ కరన్ (10 నాటౌట్), ఆర్చర్ (27 నాటౌట్)గా క్రీజులో నిలిచారు.
ఎంగిడి వేసిన చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ 27 పరుగులతో 4 సిక్సులు బాదాడు.
దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది. చెన్నైకు 217పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని అందించింది.
చెన్నై బౌలర్లలో శ్యామ్ కరన్ 3 వికెట్లు తీయగా.. జడేజా, చావ్లా, చాహర్ తలో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.