IND vs AUS 1st ODI Match
IND vs AUS ODI : ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ వన్డేలో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు భారీగా క్రీడాభిమానులు స్టేడియంకు తరలివచ్చారు. వీరితోపాటు సినీ ప్రముఖులు స్టేడియంకు తరలివచ్చి సందడి చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సతీమణితో కలిసి క్రికెట్ వీక్షించేందుకు స్టేడియంకు వచ్చారు. అదేవిధంగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కొద్దిసేపు స్టేడియంలో కలియతిరుగుతూ సందడి చేశారు.
IND VS AUS 1st ODI
వాంఖడే స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డేను వీక్షించేందుకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ప్రత్యేక ఆహ్వానం మేరకు రజనీకాంత్ వచ్చారు. తన సతీమణితో వీఐపీ గ్యాలరీలో కూర్చొని రజనీ మ్యాచ్ వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రజనీకాంత్‌ను స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌లపై కనిపించగానే స్టేడియం ప్రేక్షకులు కేరింతలతో హోరెత్తింది.
IND vs AUS 1st ODI
ఏంసీఏ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ మాట్లాడుతూ.. వాంఖడే స్టేడియానికి వచ్చి తొలి వన్డే మ్యాచ్ చూడాలని లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ ను ఆహ్వానించా. ఆయన నా ఆహ్వాన్ని మన్నించారు. చాలా రోజుల తర్వాత వాంఖడేలో సూపర్ స్టార్అడుగు పెట్టారు అని అమోల్ ఖేల్ చెప్పుకొచ్చారు.
IND VS AUS 1st ODI
మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్టేడియంలో కలియదిరుగుతూ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులకు అభివాదం చేశారు. అయితే, అజయ్ దేవగన్ నటిస్తున్న బోలా సినిమా ప్రమోషన్ సందర్భంగా స్టేడియంకు వచ్చినట్లు తెలిసింది.
Ajay Devgn
ఈ సందర్భంగా స్టేడియంలో సునీల్ గవాస్కర్, సంజయ్ ముంజ్రేకర్ అడిగిన ప్రశ్నలకు అజయ్ దేవగన్ సమాధానం ఇచ్చారు. ఇద్దరు స్టార్లు తొలి వన్డే సందర్భంగా స్టేడియంలో సందడిచేయడంతో క్రీకెట్ ను వీక్షించేందుకు వచ్చిన క్రీడాభిమానులు కేరింతలతో వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది.