Peddi Collections : బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ది దూకుడు.. రెండు రోజుల్లో క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

పెద్ది చిత్రం రెండు రోజుల వ‌సూళ్ల‌ను (Peddi Collections) తాజాగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

Ram Charan Peddi movie two days Collections

Peddi Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం పెద్ది. జూన్ 4న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం 181.8 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు ఓ పోస్ట‌ర్ ద్వారా చిత్ర బృందం తెలియ‌జేసింది.

తొలి రోజు ఈ చిత్రం 135.36 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక నేడు శ‌నివారం, రేపు ఆదివారం కావ‌డంతో ఈ చిత్ర వ‌సూళ్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. గ్రామీణ నేప‌థ్యం, క్రీడ‌ల అంశాలు, ఎమోష‌న‌ల్ కంటెంట్‌కు ఆడియ‌న్స్ ఫిదా అవుతున్నారు.

Akhil Wedding anniversary : అక్కినేని అఖిల్ పెళ్లి రోజు.. స్పెష‌ల్ ఫోటోలు.. వైర‌ల్‌

జానీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించ‌గా జ‌గ‌ప‌తి బాబు, దివ్యేందు, బొమ‌న్ ఇరానీ, ర‌వి కిష‌న్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించారు.

Nandita Swetha : అంద‌మే అసూయ ప‌డేలా.. నందితా శ్వేత క్యూట్ ఫోటోలు