Sakibul Gani : తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. బీహార్ కుర్రాడి వరల్డ్ రికార్డ్

బీహార్ రంజీ ఆటగాడు షకీబుల్‌ గని వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లో ఆడిన తొలి మ్యాచులోనే ట్రిపుల్‌ సెంచరీ బాదాడు.

Sakibul Gani

Sakibul Gani : బీహార్ రంజీ ఆటగాడు షకీబుల్‌ గని వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లో ఆడిన తొలి మ్యాచులోనే ట్రిపుల్‌ సెంచరీ బాదాడు. దీంతో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గని రికార్డులకెక్కాడు. రంజీ ట్రోఫీ 2021-22 సీజన్‌లో భాగంగా మిజోరంతో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్‌ గని ట్రిపుల్‌ సెంచరీ కొట్టాడు. 387 బంతు​ల్లోనే 300 పరుగులు చేశాడు. మొత్తంగా 405 బంతుల్లో 341 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 56 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రంజీ ట్రోఫీలో ఇదే తొలి ట్రిపుల్‌ సెంచరీ కావడం​ గమనార్హం. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బీహార్.. తన తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 686 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో గని.. బాబుల్ కుమార్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 500 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Sachin Tendulkar: తన కొడుకు ఆటను ఇప్పటివరకూ చూడని సచిన్

ఇదే మ్యాచ్‌లో మ‌రో బీహార్ ఆట‌గాడు బాబుల్ కుమార్ డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 398 బంతుల్లో 229 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. వీరిద్ద‌రికి తోడు చివ‌ర్లో వికెట్ కీప‌ర్ బిపిన్ సౌరభ్ 39 బంతుల్లోనే అజేయ హాఫ్ సెంచ‌రీ చేసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు.

బీహార్ కుర్రాడు షకీబుల్ గని అరంగేట్ర మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచ‌రీతో విశ్వ‌రూపం చూపించాడు. ఫోర్లు, సిక్సుల‌తో విరుచుకుపడ్డాడు. త‌న విధ్వంస‌క‌ర ఆటతో ప‌ట్ట ప‌గ‌లే మిజోరం బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. వ‌రుస బౌండ‌రీలతో మైదానాన్ని హోరెత్తించాడు. ష‌కీబుల్‌ను ఔట్ చేయ‌లేక మిజోరం బౌల‌ర్లు త‌ల‌ప‌ట్టుకున్నంత ప‌నైంది.

IPL 2022: కోల్‌కతాకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్

కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ క్యాంపస్ 2వ గ్రౌండ్‌లో గ్రూప్ మ్యాచ్‌ల్లో బీహార్, మిజోరం మ‌ధ్య జరిగిన మ్యాచ్‌తో 22 ఏళ్ల ష‌కీబుల్ గ‌ని ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 71 ప‌రుగుల దగ్గర బీహార్ మూడో వికెట్ కోల్పోయాక ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన ష‌కీబుల్.. మిజోరం బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థవంతంగా ఎదుర్కొన్నాడు. వ‌రుస‌గా బౌండ‌రీలు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో సెంచ‌రీ, డబుల్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఊపులో 387 బంతుల్లోనే ట్రిపుల్ సెంచ‌రీ కూడా చేశాడు. దీంతో క్రికెట్ చ‌రిత్రలోనే ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచ‌రీ చేసిన తొలి ఆట‌గాడిగా ష‌కీబుల్ గ‌ని ప్ర‌పంచ రికార్డు సృష్టించాడు.

ఈ క్ర‌మంలో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్ రోహరా రికార్డును ష‌కీబుల్ గ‌ని బ‌ద్ద‌లు కొట్టాడు. 2018-19 రంజీ ట్రోఫీ సీజన్‌లో హైదరాబాద్‌పై అజయ్ 267 ప‌రుగులు చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా ఇప్పటివరకు అతడే ఉన్నాడు. తాజాగా ఆ రికార్డును ష‌కీబుల్ గ‌ని బ్రేక్ చేశాడు.