రషీద్.. నీ Camel Bat అదుర్స్.. మన IPLకు ఇదే తీసుకురా!

  • Publish Date - December 30, 2019 / 07:42 AM IST

బిగ్ బాష్ లీగ్ (BBL)టోర్నీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్ బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ కొత్త బ్యాట్‌తో మెరిసిపోయాడు. దీనికి Camel Bat అని పేరు పెట్టారు. ఇదే బ్యాటుతో మ్యాచ్‌లో రషీద్ ఖాన్ రెచ్చిపోయి పరుగుల వరద పారించాడు.

అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు తరపున రషీద్ ఆడిన 16 బంతుల్లో (2 ఫోర్లు, ఎక్కువ సిక్సర్లతో) 25 పరుగులతో అదరగొట్టేశాడు. ఆల్ రౌండర్ రషీద్ తన క్యామిల్ బ్యాట్ ఝళిపించడంతో 18 పరుగుల తేడాతో మెల్ బోర్న్ రెనిగేడ్స్ జట్టుపై అడిలైడ్ స్ట్రైకర్స్ విజయం సాధించింది.

‘రషీద్ కొత్త బ్యాటును ‘The Camel’ అని పిలుస్తున్నారు. @rashidkhan_19 కొత్త బ్యాట్ స్టయిల్ ? #BBL09 అనే క్యాప్షన్ తో cricket.com.au ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. రషీద్ చేతబట్టిన Camel బ్యాట్ చూసిన క్రికెట్ అభిమానులంతా వావ్.. క్యామిల్ బ్యాట్ సూపర్.. అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ ట్వీట్‌పై ఐపీఎల్ ప్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా స్పందిస్తూ.. రషీద్ ఖాన్.. వచ్చే IPL 2020 సీజన్‌లో కూడా మన జట్టులో ఇదే Camel Bat పట్టుకురా.. దుమ్ము దులిపేద్దాం అంటూ ఫన్నీ ట్వీట్ చేసింది.