Ratan Tata : క్రికెట‌ర్‌ ర‌షీద్‌ఖాన్‌కు 10 కోట్ల రివార్డు.. వాస్త‌వాలు వెల్ల‌డించిన ర‌త‌న్ టాటా

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ర‌త‌న్ టాటా అఫ్గానిస్థాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ కు రూ.10 కోట్ల రివార్డు అందించారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

Rashid Khan-Ratan Tata

Ratan Tata-Rashid Khan : ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ర‌త‌న్ టాటా అఫ్గానిస్థాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ కు రూ.10 కోట్ల రివార్డు అందించారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిపై ఎక్స్‌ వేదిక‌గా ర‌త‌న్ టాటా స్పందించారు. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌న్నారు. తాను ఏ క్రికెట‌ర్‌కు రివార్డు ప్ర‌క‌టించ‌లేద‌ని తెలిపారు. అలాంటి వార్త‌ల‌ను న‌మ్మొద్దని చెప్పారు. అలాంటిది ఏమైనా ఉంటే త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా వెల్ల‌డిస్తాన‌ని ర‌త‌న్ టాటా తెలిపారు.

సోషల్ మీడియాలో వైర‌ల్ అయిన వార్త‌ల్లో ఏం ఉందంటే..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ జ‌ట్టు ను 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ ఓడించింది. ఈ మ్యాచ్ అనంత‌రం అఫ్గాన్ క్రికెట‌ర్లు గెలుపు సంబ‌రాలు చేసుకున్నారు. ఈ స‌మ‌యంలో ర‌షీద్ ఖాన్ భార‌త జెండా ప‌ట్టుకుని క‌నిపించాడ‌ట‌. దీన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ర‌షీద్‌కు రూ.55 ల‌క్ష‌ల జ‌రిమానా విధించిన‌ట్లు ఆ వార్త‌ల్లో ఉంది. ఈ విష‌యం తెలుసుకున్న ర‌త‌న్ టాటా వెంట‌నే ర‌షీద్ ఖాన్‌కు రూ.10కోట్లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించార‌ని ఆ వార్త‌ల సారాంశం.

Rohit Sharma : ఇంగ్లాండ్ పై భారీ విజయం.. అయినా ప్రతిసారి ఇలా ఉండదన్న రోహిత్ శర్మ.. అలా ఎందుకన్నాడంటే?

ఈ వార్త‌లు వైర‌ల్ కావ‌డంతో దీనిపై ర‌త‌న్ టాటా స్పందించారు. తాను ఏ ఆటగాడికి రివార్డు ప్ర‌క‌టించ‌లేద‌న్నారు. క్రికెట్‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పుకొచ్చారు. త‌న నుంచి అధికారిక స‌మాచారం వ‌స్తే త‌ప్ప ఇలాంటి ఫార్వార్డ్ మెసెజ్‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు.

ఇదిలా ఉంటే.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జ‌ట్లు అక్టోబ‌ర్ 23న‌ చెన్నై వేదిక‌గా త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఏడు వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు చేసింది. పాక్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ బాబర్ అజామ్ 74, ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 58 పరుగులతో రాణించారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని అఫ్గానిస్థాన్ 49 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో ఇబ్ర‌హీం (87), ర‌హ్మ‌ద్ షా (77నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు.

IND vs ENG : ఇటు కోహ్లీ.. అటు రూట్‌.. 48 ఏళ్ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఇలా మొద‌టిసారి