Ravi Shastri : ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డం అంత ఈజీ కాదు.. ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Ravi Shastri comments : టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లు గెల‌వ‌డం అంత సుల‌భం కాద‌న్నాడు.

Ravi Shastri

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిసి 10 రోజులు కావొస్తున్న‌ప్ప‌టికీ ఆ ఓట‌మి బాధ‌ను అభిమానులు ఇంకా జీర్ణించుకోలేదు. వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు దూసుకువ‌చ్చిన భార‌త జ‌ట్టు ఆఖ‌రి మెట్టు పై బోల్తా ప‌డింది. ప్ర‌స్తుతం టీమ్ఇండియా దృష్టంతా 2024లో వెస్టిండీస్‌, యూఎస్ఏ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పైనే ఉంది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లు గెల‌వ‌డం అంత సుల‌భం కాద‌న్నాడు. అదే స‌మ‌యంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు విజ‌యం సాధిస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ర‌విశాస్త్రి మాట్లాడుతూ.. ఏదీ సుల‌భంగా రాదన్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డం అంత ఈజీ కాద‌న్నాడు. సచిన్ టెండూల్క‌ర్ వంటి దిగ్గ‌జ ఆట‌గాడికి సైతం వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ క‌ల ఆరో ప్ర‌య‌త్నంలోనే సాధ్యమైంద‌న్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వాలంటే ఫైన‌ల్ రోజున అత్యుత్త‌మంగా ఆడాల‌ని చెప్పుకొచ్చాడు. అంత‌క‌ముందు వ‌ర‌కు ఎలా ఆడాము అన్న‌ది ముఖ్య కాద‌ని తెలిపాడు.

RCB : దుర‌దృష్టం అంటే ఆర్‌సీబీదే..! ఆ జ‌ట్టు వ‌దిలేసిన ఆట‌గాళ్లు ఇతర ఫ్రాంచైజీల్లో మెరుగైన ప్రదర్శన

కీల‌కమైన సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచుల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన జ‌ట్టే విజేత‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. వ‌న్డేప్ర‌పంచ‌క‌ప్ 2023లో మొద‌టి రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అయితే.. ఆ త‌రువాత రాణించింది. ముఖ్యంగా సెమీస్ , ఫైన‌ల్‌లో అత్యుత్త‌మంగా రాణించారు కాబ‌ట్టే విశ్వ‌విజేత‌లుగా నిలిచార‌న్నారు. ఇక ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఓడిపోవ‌డం త‌న‌కు బాధ‌క‌లిగించింద‌న్నారు. దీన్ని ప్లేయ‌ర్లు పాఠాలు నేర్చుకోవాల‌ని సూచించారు.

టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డం చూస్తా..

ఇక టీమ్ఇండియా త్వ‌ర‌లోనే ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలవ‌డాన్ని తాను చూస్తాన‌ని చెప్పాడు. అయితే.. ఇది వ‌న్డేల్లో జ‌ర‌గ‌క‌పోవ‌చ్చున‌ని తెలిపాడు. జ‌ట్టును పున‌ర్‌నిర్మాణం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. కానీ.. వ‌చ్చే ఏడాదిలో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ సొంతం చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నాడు. ఖ‌చ్చితంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా గ‌ట్టిపోటీదారు అని, ఇక భార‌త జ‌ట్టు పొట్టి ఫార్మాట్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద పెట్టాలి అని ర‌విశాస్త్రి అన్నారు.

ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. మొద‌టి రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించి భార‌త జ‌ట్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొన‌సాగుతోంది. హార్ధిక్ పాండ్య గాయంతో దూరం అవ‌డంతో ఈ సిరీస్‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు స‌న్నాహ‌కాల్లో భాగంగానే టీమ్ఇండియా ఈ సిరీస్‌ను భావిస్తోంది.

Yashasvi Jaiswal : అది ముమ్మాటికీ నా త‌ప్పే.. అందుకే క్ష‌మాప‌ణ‌లు చెప్పా : య‌శ‌స్వి జైస్వాల్‌

 

ట్రెండింగ్ వార్తలు