ధోనీకి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..! ఆత్మకథలో ఆసక్తికర విషయాన్ని చెప్పిన అశ్విన్

అశ్విన్ తన ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2010లో పోర్ట్ ఎలిజబెత్ లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ జరుగుతుంది. నేను, శ్రీశాంత్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నాం.

Ravichandran Ashwin

R Ashwin Autobiography : టీమిండియా స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ తన ఆత్మకథ పుస్తకంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఐ హావ్ ది స్ట్రీట్స్ – ఎ కుట్టి క్రికెట్ స్టోరీ’ పేరుతో 184 పేజీల పుస్తకాన్ని అశ్విన్ తీసుకొచ్చాడు. ఈ పుస్తకంలో తను టీమిండియా క్రికెట్ లోకి ఎంట్రీ నుంచి 2011లో టీమిండియా ప్రపంచ కప్ విజయం వరకు పలు విషయాలను ప్రస్తావించారు. తన ఆత్మకథ పుస్తకంలో 2010 సంవత్సరంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని అశ్విన్ చెప్పుకొచ్చాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కోపం వస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని అశ్విన్ తెలియజేశారు.

Also Read : Ben Stokes: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డు.. టెస్ట్ క్రికెట్లో మూడో ప్లేయర్..

మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో ఎప్పుడూ కూల్ గా ఉంటాడు. తనకు నచ్చని విషయం ఏదైనా జరిగినా తన ముఖంలో ఆ చిరాకు కనిపించకుండా జాగ్రత్త పడతాడు. టీమిండియా ఓటమి అంచుల్లోకి వెళ్లిన సమయాల్లో తన కూల్ కెప్టెన్సీతో అనేక సార్లు జట్టును విజేతగా నిలిపిన ఘనత ధోనీది. అలాంటి ధోనీని మైదానంలో కోపంగా చూడటం చాలా అరుదు. కానీ, ధోనీకి నిజంగా కోపమొస్తే ఎలా ఉంటుందో అశ్విన్ పూసగుచ్చినట్లు శ్రీశాంత్ ఘటనను వివరించాడు. 2010లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో పేసర్ శ్రీశాంత్ ప్రవర్తన కెప్టెన్ ధోనీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందట.

Also Read : Wanindu Hasaranga : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌.. కెప్టెన్సీకి హ‌స‌రంగ గుడ్ బై

అశ్విన్ తన ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2010లో పోర్ట్ ఎలిజబెత్ లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ జరుగుతుంది. నేను, శ్రీశాంత్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నాం. మైదానంలో ధోనీకి తరచూ నీళ్లు తీసుకెళ్లి ఇస్తున్నా. ప్రతీసారి నీళ్లిచ్చేందుకు నేనే వెళ్లడంతో.. ప్రతీసారి నువ్వే ఎందుకు వస్తున్నావ్.. శ్రీశాంత్ ఎక్కడ అంటూ ధోనీ ప్రశ్నించాడు. పైన డ్రెస్సింగ్ రూంలో ఉన్నాడని చెప్పా. వెంటనే కిందికి రమ్మని చెప్పు.. మిగతా రిజర్వ్ ఆటగాళ్లతో కలిసి కూర్చోమని శ్రీశాంత్ కు చెప్పు అంటూ ధోనీ సూచించాడు. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి ధోనీ మెస్సేజ్ ను శ్రీశాంత్ కు తెలియజేశాను. కానీ, శ్రీశాంత్ పెద్దగా పట్టించుకోలేదు. డ్రెస్సింగ్ రూంలోనే ఉండిపోయాడు. అనంతరం ధోనీకి హెల్మెంట్ కావాలంటే ఇవ్వడానికి మళ్లీ నేనే వెళ్లాను. అప్పుడు ధోనీ చాలా కోపంగా ఉన్నాడు. శ్రీశాంత్ ఏం చేస్తున్నాడు? అని ధోనీ నన్ను ప్రశ్నించాడు. మసాజ్ చేయించుకుంటున్నాడని చెప్పాను. తర్వాత ఓవర్లో హెల్మెంట్ తిరిగి ఇవ్వడానికి నన్ను పిలిచాడు. హెల్మెంట్ తిరిగిస్తూ శ్రీశాంత్ భారత్ కు తిరిగి వెళ్లేలా విమానం టికెట్ బుక్ చేయమని మేనేజర్ కు చెప్పు అని ధోనీ తనకు చెప్పాడు.

ఆ విషయం తెలుసుకున్న శ్రీశాంత్ టీమిండియా జెర్సీ ధరించి వెంటనే కిందకు వచ్చి రిజర్వ్ ఆటగాళ్ల వద్ద కూర్చున్నాడు. డ్రింక్స్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ధోనీ ఎప్పుడు నీళ్లు అడిగినా శ్రీశాంత్ వెళ్లి ఇచ్చాడు. అంటూ అశ్విన్ తన ఆత్మకథం పుస్తకంలో పేర్కొన్నాడు. ధోనీకి కోపం రావడం చాలా అరుదు. ఆ కోపం తీవ్రరూపం దాల్చితే కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి ధోనీ ఏ మాత్రం వెనుకాడడు అంటూ అశ్విన్ పేర్కొన్నాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు