Virat Kohli ODI Future : 2027 ప్రపంచకప్ దిశగా భారీ మార్పులు.. రోహితే కాదు.. కోహ్లీపై కూడా వేటు? మాజీ స్పిన్నర్ సంచలన కామెంట్స్..

Virat Kohli ODI Future : రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ మాజీ స్పిన్నర్ రవించందర్ అశ్విన్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి కీలక కామెంట్స్ చేశారు.

Rohit sharma, Virat Kohli

  • వన్డేలకు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైన రోహిత్?
  • లార్డ్స్‌ వేదికగా ప్రకటన ఉంటుందంటూ ప్రచారం
  • తారుత టార్గెట్ కోహ్లీనే అంటూ మాజీ స్పీన్నర్ కామెంట్స్

Virat Kohli ODI Future : 2027లో జరగబోయే వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలనేదే భారత్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ టార్గెట్. కానీ, ఆయన కల నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌ రోహిత్‌ శర్మకు చివరిది కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరగబోయే మూడో వన్డేనే హిట్‌మ్యాన్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ అని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక కామెంట్స్ చేశారు.

Also Read : Rohit Sharma : రోహిత్ శ‌ర్మ రిటైర్‌మెంట్ వార్త‌ల వేళ‌.. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొట‌క్ కీల‌క వ్యాఖ్య‌లు..

టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ మధ్యలో రోహిత్ శర్మను వన్డే జట్టులో నుంచి తప్పించే అవకాశాలపై వార్తలు వస్తుండగా.. విరాట్ కోహ్లీపైనా వేటు తప్పదనే వాదనలను కొందరు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇదే విషయంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అశ్విన్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, భవిష్యత్తులో విరాట్ కోహ్లీకి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. అందుకే బీసీసీఐ సెలక్షన్ కమిటీ సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం రోహిత్ శర్మ ఫామ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆయన ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మాత్రం రోహిత్‌పై పూర్తి నమ్మకం ఉందని, ఆయన ఇంకా జట్టుకు కీలక ఆటగాడేనని స్పష్టం చేశారు.

అశ్విన్ అభిప్రాయం ప్రకారం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగడం కంటే, బీసీసీఐ ముందుగానే స్పష్టత ఇవ్వడం మంచిదని చెప్పారు. లేకపోతే ఇలాంటి చర్చలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఎవరినైనా జట్టు నుంచి తొలగించవచ్చు. అది సెలెక్టర్, కెప్టెన్, కోచ్ ల పని. ఒకవేళ ఎవరినైనా తొలగిస్తే అందులో ఎలాంటి సమస్యలేదు.. కానీ వారిని గౌరవంగా సాగనంపే విధానంలో ఉండాలి. ఉదాహరణకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు భారత క్రికెట్ కు గొప్ప సేవలు అందించారు. అలాంటి వారిని తొలగించాలని భావించినట్లయితే.. వారితో మాట్లాడాలి.. వారిని గౌరవప్రదంగా రిటైర్మెంట్ అయ్యే పరిస్థితిని కల్పించాలని అశ్విన్ పేర్కొన్నారు.

రోహిత్ శర్మపై రిటైర్మెంట్ వార్తలు వస్తున్నాయి.. రోహిత్ తరువాత విరాట్ కోహ్లీని కూడా సెలెక్టర్లు పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే యువ ప్లేయర్లకు అవకాశం కల్పించాలంటే ఇది సర్వసాధారణమే. ముఖ్యంగా 2027 ప్రపంచ కప్ టోర్నీలో పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని అశ్విన్ అన్నారు.

అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టూర్ లో పరుగుల రాబట్టడంలో రోహిత్ శర్మ విఫలమయ్యాడు. కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే, 2027 వన్డే ప్రపంచ కప్ కోసం యశస్వీ జైస్వాల్‌ను ఒక సంవత్సరం పాటు పరీక్షించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్ శర్మపై వేటు వేసేందుకు సెలెక్టర్లు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే విషయాన్ని రోహిత్ శర్మకు సూచించినట్లు.. లాడ్స్ లో జరిగే వన్డేలో రోహిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రోహిత్ టెస్టులు, టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.