×
Ad

Ravichandran Ashwin : స‌న్నీలియోన్ ఫోటోను పోస్ట్ చేసిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌ర‌చ్చ‌..

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ravichandran Ashwin ) మంగ‌ళ‌వారం త‌న సోష‌ల్ మీడియాలో బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్ ఫోటోను పోస్ట్ చేశాడు.

Ravichandran Ashwin Shares Sunny Leone Picture On social media

Ravichandran Ashwin : టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మంగ‌ళ‌వారం త‌న సోష‌ల్ మీడియాలో బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్ ఫోటోను పోస్ట్ చేశాడు. స‌న్నీ లియోన్ ఫోటోతో పాటు ఓ వీధి ఫోటోను షేర్ చేసి నెటిజ‌న్ల‌కు ఓ చిన్న పజిల్‌నే పెట్టాడు. దీన్ని చూసిన నెటిజ‌న్లు అశ్విన్ తెలివికి ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

కొంద మంది అశ్విన్ పోస్ట్‌ను అర్థం చేసుకోలేక‌పోయారు. మ‌రికొంద‌రు మాత్రం అశ్విన్ (Ravichandran Ashwin) పోస్ట్‌కు అర్థాన్ని చెప్పేశారు. అశ్విన్ త‌మిళ‌నాడు కు చెందిన ఆల్‌రౌండ‌ర్ స‌న్నీ సంధును ప్ర‌శంసించే క్ర‌మంలో ఈ ఫోటో పెట్టిన‌ట్లుగా కొంద‌రు చెబుతున్నారు.

Suryakumar Yadav : ఆ ఒక్క ప‌ని చేస్తే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల ఎలైట్ జాబితాలోకి సూర్య‌కుమార్ యాద‌వ్‌..

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ2025లో స‌న్నీ సంధు ఇటీవ‌ల అరంగ్రేటం చేశాడు. సోమ‌వారం అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీస్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 184 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో సాయి సుద‌ర్శ‌న్ (101 నాటౌట్‌) క‌లిసి కీల‌క‌మైన 37 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో సన్నీ సంధు (30; 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించాడు.

ఈ నేప‌థ్యంలో అత‌డిని ప్ర‌శంసించేందుకు అశ్విన్ బాలీవుడ్ భామ స‌న్నీ లియోన్ ఫోటోతో పాటు చెన్నైలోని ఓ వీధి ఫోటోను షేర్ చేశాడు.

2025లో పాకిస్తాన్ వాళ్లు పిచ్చి పిచ్చిగా వెతికిన మన ప్లేయర్ ఎవరో తెలుసా..? రోహిత్, కోహ్లీ కాదు..