Suryakumar Yadav : ఆ ఒక్క పని చేస్తే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఎలైట్ జాబితాలోకి సూర్యకుమార్ యాదవ్..
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సరసన చేరేందుకు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 246 పరుగుల దూరంలో ఉన్నాడు.
IND vs SA T20 series Suryakumar Yadav will achieve a major milestone
Suryakumar Yadav : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు (మంగళవారం, డిసెంబర్ 9) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
గాయాల కారణంగా జట్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా.. ఈ సిరీస్‌లో అందరి దృష్టి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పైనే ఉంటుంది. గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు.
ఇటీవల జరిగిన ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 39*, 1, 24, 20 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనైనా సూర్య ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రోహిత్, కోహ్లీ ఎలైట్ జాబితాలో చేరేందుకు..
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సరసన చేరేందుకు సూర్యకుమార్ యాదవ్ 246 పరుగుల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అతడు 246 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతడు 3 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. టీమ్ఇండియా తరుపున ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాత్రమే సూర్య కన్నా ముందు ఈ ఘనత సాధించారు.
Sania Mirza : ఇటు సానియా మీర్జా .. అటు ఆమెకే పోటీ ఇస్తున్న బుడ్డోడు ఎవరో తెలుసా..!
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. 159 మ్యాచ్‌ల్లో 4231 పరుగులు చేశాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 125 మ్యాచ్‌ల్లో 4188 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు. 95 మ్యాచ్‌ల్లో 2754 పరుగులు చేశాడు.
