IND vs SA : నేటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. రెండు చారిత్రాత్మ‌క మెలురాళ్ల‌కి చేరువ‌లో హార్దిక్ పాండ్యా..

భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య నేటి (IND vs SA ) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs SA : నేటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. రెండు చారిత్రాత్మ‌క మెలురాళ్ల‌కి చేరువ‌లో హార్దిక్ పాండ్యా..

IND vs SA T20 series Hardik Pandya on the verge of historic milestone

Updated On : December 9, 2025 / 10:52 AM IST

IND vs SA : భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య నేటి (మంగ‌ళ‌వారం డిసెంబర్ 9) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్‌కు క‌ట‌క్ ఆతిథ్యం ఇస్తోంది. ఆసియాక‌ప్ 2025లో గాయ‌ప‌డిన ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. కాగా.. ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా రెండు మైలురాళ్ల‌ను సాధించే అవ‌కాశం ఉంది.

2016లో అంత‌ర్జాతీయ టీ20ల్లో అరంగ్రేటం చేశాడు హార్దిక పాండ్యా. ఇప్ప‌టి వ‌ర‌కు 120 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 27.4 స‌గటుతో 1860 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 98 వికెట్లు సాధించాడు. ఇందులో మూడు సార్లు నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న ఉంది.

IPL 2026 Auction : ఫసా ఫసా లేపేశారు.. ఐపీఎల్ వేలం నుంచి 1005 మంది ఔట్.. ఎందుకంటే..

ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో పాండ్యా బ్యాటింగ్‌లో 140 ప‌రుగులు చేస్తే టీమ్ఇండియా త‌రుపున పొట్టి ఫార్మాట్‌లో 2వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఇక బౌలింగ్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొడితే వంద వికెట్ల క్ల‌బ్‌లో చేరుతాడు. ఈ ఘ‌న‌త సాధించిన రెండో భారత ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు. అర్ష్‌దీప్ సింగ్ మాత్ర‌మే టీమ్ఇండియా త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు వంద వికెట్లు తీసిన ఏకైక ప్లేయ‌ర్‌గా ఉన్నాడు.

అత‌డి అనుభ‌వం ఎంతో విలువైంది..

హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీపై టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ద‌క్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు స్పందించాడు. అత‌డి అనుభ‌వం ఎంతో విలువైంద‌న్నాడు. అతడు ప్ర‌ధాన టోర్న‌మెంట్ల‌లో చాలా బాగా రాణిస్తాడ‌ని చెప్పుకొచ్చాడు. అత‌డు ఉంటే జ‌ట్టుకు స‌మ‌తూకం వ‌స్తుంద‌న్నాడు.

2025లో పాకిస్తాన్ వాళ్లు పిచ్చి పిచ్చిగా వెతికిన మన ప్లేయర్ ఎవరో తెలుసా..? రోహిత్, కోహ్లీ కాదు..

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 – డిసెంబర్ 9న‌ (కటక్)
* రెండో టీ20 – డిసెంబర్ 11న‌ (ముల్లాన్‌పూర్)
* మూడో టీ20 – డిసెంబర్ 14న‌ (ధర్మశాల)
* నాలుగో టీ20 – డిసెంబర్ 17న (లక్నో)
* ఐదో టీ20 – డిసెంబర్ 19న‌ (అహ్మదాబాద్)

టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.