మోడీజీ మా హక్కును వాడుకునేందుకు అవకాశం ఇవ్వండి: అశ్విన్

  • Publish Date - April 1, 2019 / 02:39 AM IST

ప్రముఖ క్రికెటర్.. కింగ్స్ లెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ప్రధాని నరేంద్ర మోడీకీ ఒక అప్పీల్ చేసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఓటు వేసే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు జరిగే సమయంలో ఐపీఎల్‌ కూడా జరుగుతుందని, అందులో భాగంగా భారత జట్టుకు సంబంధించిన కీలక ఆటగాళ్లు వివిధ రాష్ట్రాలలో.. వివిధ నగరాలలో ఉండవలసిన పరిస్థితి. అయితే  ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు తాను నివసించే పట్టణంలోనే ఓటు వేయాలి.

ఈ నిబంధన కారణంగా ఓటు హక్కును కోల్పోతున్నామని, తాము ఓటు తప్పని సరిగా వేయాలని, అందుకోసం తామున్న చోటే ఓటు వేసే అవకాశం కల్పించాలని అశ్విన్ ప్రధానిని కోరారు. అంతేకాకుండా ఓటు వేయడం ప్రతీ ఒక్కరి ప్రాధమిక హక్కు అని, ఆ హక్కును వినియోగించుకుని సరైన లీడర్‌ను ఎన్నుకోవాలని అశ్విన్ సూచించారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. రవిచంద్రన్ అశ్విన్‌కు తమిళనాడులో ఓటు ఉన్న సంగతి తెలిసిందే.