IND vs ENG 3rd Test : టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. రవీంద్ర జడేజా వచ్చేస్తున్నాడు

ఇంగ్లండ్ తో విశాఖలో జరిగిన రెండో టెస్టుకు జడేజా దూరమయ్యాడు. అయితే, మూడో టెస్టు మ్యాచ్ కు తుది జట్టులో ఎంపిక కావాలంటే ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం..

Ravindra Jadeja

Ravindra Jadeja IND vs ENG: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇండియా – ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ తుదిజట్టులోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇండియా – ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ గురువారం నుంచి రాజ్ కోట్ వేదికగా ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్ జరగ్గా.. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. రెండో మ్యాచ్ విశాఖపట్టణంలో జరగ్గా టీమిండియా విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 1-1 తో సమఉజ్జీలుగా ఉన్నారు. మూడో మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో తుది జట్టులోకి జడేజా ఉంటాడా ఉండడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, జడేజా ఇంగ్లండ్ తో మూడో టెస్టు మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. నివేదికల ప్రకారం.. జడేజా మంగళవారం రాజ్ కోటలో టీమిండియా జట్టుతో ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.

Also Read : David Warner : ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును చిన్నారికి ఇచ్చిన వార్న‌ర్‌.. ఎందుకో తెలుసా?

ఇంగ్లండ్ తో జరగబోయే మూడు టెస్టు మ్యాచ్ లకు 17మంది సభ్యులతో బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు కూడా ఉన్నారు. గాయం కారణంగా టీమిండియా బ్యాటర్స్ శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ తో మూడో మ్యాచ్ కు దూరమయ్యారు. జడేజా కూడా గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్ తో విశాఖలో జరిగిన రెండో టెస్టుకు జడేజా దూరమయ్యాడు. అయితే, మూడో టెస్టు మ్యాచ్ కు తుది జట్టులో ఎంపిక కావాలంటే ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. రవీంద్ర జడేజా మంగళవారం టీమిండియా సభ్యులతో ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. అతను చాలా ఫిట్‌నెస్‌ తో ఉన్నాడని, రాజ్‌కోట్ టెస్టు నుంచి తిరిగి మైదానంలోకి రావచ్చునని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా రాజ్ కోట్ టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. దీంతో ఈ ఇద్దరు ప్లేయర్స్ మూడో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Also Read : Ravichandran Ashwin : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. ప‌లు రికార్డుల‌పై క‌న్నేసిన అశ్విన్‌

ఇంగ్లండ్ తో తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా జరిగింది. ఈ టెస్టులో జడేజా బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీశాడు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు