Ravichandran Ashwin : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. పలు రికార్డులపై కన్నేసిన అశ్విన్
మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.

Ravichandran Ashwin four wickets away from unlocking new milestone
Ashwin : మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 (గురువారం) నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచులో అశ్విన్ ఈ రికార్డులను అందుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత జట్టు రాజ్‌కోట్ చేరుకుంది. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.
ఒక్క వికెట్ తీస్తే..
రాజ్‌కోట్ టెస్టు మ్యాచులో అశ్విన్ ఒక్క వికెట్ పడగొడితే 500 వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటి వరకు అశ్విన్ 97 టెస్టు మ్యాచులు ఆడాడు. 183 ఇన్నింగ్స్‌ల్లో 499 వికెట్లు పడగొట్టాడు. 34 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. కాగా.. అశ్విన్ ఒక్క వికెట్ తీస్తే.. ఐదు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కనున్నాడు.
స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా..
టెస్టుల్లో స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు అశ్విన్‌కు మరో ఐదు వికెట్లు అవసరం. ఐదు వికెట్లు తీస్తే గనుక అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బద్దలు కొడుతాడు. కుంబ్లే స్వదేశంలో 350 వికెట్లు తీయగా అశ్విన్ 346 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
AUS vs WI : డేవిడ్ వార్నర్ విధ్వసం.. రసెల్ ఊచకోత.. మూడో టీ20లో విండీస్ గెలుపు
భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమ్ఇండియా ఆటగాళ్లు వీరే..
అనిల్ కుంబ్లే – 350 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ – 346
హర్భజన్ సింగ్ – 265
కపిల్ దేవ్ – 219
రవీంద్ర జడేజా – 199
బిఎస్ చంద్రశేఖర్ – 142
బిషన్ సింగ్ బేడీ – 137
జహీర్ ఖాన్ – 104
ఇషాంత్ శర్మ – 104
ఇంగ్లాండ్ పై వంద వికెట్లు..
ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో ఇప్పటికే అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 97 వికెట్లు అతడు పడగొట్టాడు. మరో మూడు వికెట్లు తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా రికార్డులకు ఎక్కనున్నాడు.
ఇంగ్లాండ్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్లు..
రవిచంద్రన్ అశ్విన్ – 97 వికెట్లు
బిఎస్ చంద్రశేఖర్ – 95
అనిల్ కుంబ్లే – 92
బిషన్ సింగ్ బేడి – 85
కపిల్ దేవ్ – 85
ఇషాంత్ శర్మ- 67
BCCI : బీసీసీఐ కీలక నిర్ణయం! ఇషాన్ కిషన్‌తో పాటు మిగిలిన ఆటగాళ్లకు గట్టి షాక్!