BCCI : బీసీసీఐ కీలక నిర్ణయం! ఇషాన్ కిషన్‌తో పాటు మిగిలిన ఆటగాళ్లకు గట్టి షాక్!
ఒకప్పుడు క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచులు లేకుంటే రంజీల్లో ఆడేవారు.

BCCI mandates player participation in next round of Ranji Trophy matches
ఒకప్పుడు క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచులు లేకుంటే రంజీల్లో ఆడేవారు. అయితే.. ఇప్పడు కొందరు క్రికెటర్లు మాత్రం రంజీలు ఆడేందుకు విముఖత చూపిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచులు, ఐపీఎల్ మాత్రమే ఆడతామని అంటున్నారు. అలాంటి ఆటగాళ్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఆటగాళ్లు అందరూ ఖచ్చితంగా రంజీ ట్రోఫీ ఆడాల్సిందేనని స్పష్టం చేసింది.
ప్రస్తుతం జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహాబిటేషన్‌లో ఉన్న ఆటగాళ్లు మినహా మిగిలిన అందరూ తదుపరి రౌండ్ రంజీ మ్యాచులు ఆడాల్సిందేనని చెప్పింది. తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఆటగాళ్లు అందరికి మెయిల్స్ పంపినట్లు ఆంగ్ల మీడియా తెలిపింది.
ICC Player of the Month : జనవరి నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకుంది ఎవరో తెలుసా?
ఐపీఎల్ కోసం..!
గతేడాది డిసెంబర్ నుంచి ఇషాన్ కిషన్ ఆటకు దూరంగా ఉంటున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన అతడు మానసిక సమస్యలు అంటూ స్వదేశానికి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ విషయమై కోచ్ ద్రవిడ్‌ను మీడియా ప్రశ్నించగా.. టీమ్ఇండియాలోకి రావాలంటే ఎవరైనా సరే ఖచ్చితంగా దేశవాలీలో ఆడాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.
ఈ మాటలను ఇషాన్ పట్టించుకోలేదు. తనకు రంజీలే అవసరం లేదన్నట్లుగా అతడి వ్యవహరం ఉంది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం అతడు సిద్ధమవుతున్నాడు. బరోడా వెళ్లి పాండ్యా బ్రదర్స్‌తో కలిసి సాధన చేస్తున్నాడు. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఇషాన్ కిషన్‌తో పాటు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు సైతం రంజీల్లో ఆడక తప్పదు. చూడాలీ మరి ఇప్పుడైన ఇషాన్ రంజీల్లో ఆడి టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇస్తాడో లేదో.
Virat Kohli : కోహ్లీ భార్యకు ఏమైంది? అనుష్కశర్మ ప్రెగ్నెన్సీలో సమస్యలు? ఏదీ నిజం?