IPL 2023: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం.. మహ్మద్ సిరాజ్ బీసీసీఐకు తెలియజేయడంతో వెలుగులోకి వ్యవహారం ..

ఆర్సీబీ అంతర్గత వ్యవహారాల గురించి తెలియజేయాలంటూ ఓ వ్యక్తి క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ను సంప్రందించాడు. అప్రమత్తమైన సిరాజ్.. విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులకు సమాచారం ఇచ్చారు.

Mohammad Siraj

IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. చివరి వరకు టీంల మధ్య గెలుపు దోబూచులాడుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్కంఠభరితంగా మ్యాచ్ లను వీక్షిస్తున్నారు. మరోవైపు బెట్టింగ్‌లు‌సైతం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ అప్రమత్తతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగింది. అయితే సిరాజుద్దీన్‌ను సంప్రదించింది బుకీ కాదని, ఆటో డ్రైవర్ అని తేలింది. అతను బెట్టింగ్ వ్యవహారంలో భారీగా డబ్బు పోగొట్టుకున్నాడని బీసీసీఐ అవినితి నిరోధక విభాగం అధికారులు తేల్చారు.

Arjun Tendulkar: ఐపీఎల్‌లో కొడుకు తొలి వికెట్‌పై సచిన టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ ..

హైదరాబాద్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆడుతున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి సిరాజ్‌ను సంప్రదించి మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన సిరాజ్ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేశారు.

Arjun Tendulkar: ఐపీఎల్‌లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్ .. రోహిత్ ఫుల్ ఖుషీ.. సంబరాలు అదుర్స్ ..

రంగంలోకి దిగిన వారు సదరు వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతను బుకీ కాదని తేల్చారు. సిరాజ్‌ను సంప్రదించింది హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ అని బీసీసీఐ నిర్ధారణకు వచ్చింది. అయితే, సదరు వ్యక్తి ఐపీఎల్‌లో బెట్టింగ్ లు పెట్టి భారీగా డబ్బును కోల్పోయాడని తెలిసింది.

IPL 2023, SRH vs MI: ఉప్ప‌ల్‌లో అద‌ర‌గొట్టిన రోహిత్ సేన‌.. హ్యాట్రిక్ విజ‌యాలు

ఈ విషయంపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. మహ్మద్ సిరాజ్ ను సంప్రదించింది బుకీ కాదు. హైదరాబాద్ కు చెందిన ఓ డ్రైవర్. మ్యాచ్ లపై బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో అతను భారీ మొత్తంలో డబ్బును పోగొట్టుకున్నాడు. ఆర్సీబీ జట్టు అంతర్గత సమాచారం కోసం సిరాజ్ ను సంప్రదించాడు. సిరాజ్ వెంటనే ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేశారు. లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారని చెప్పారు.