Arjun Tendulkar: ఐపీఎల్లో కొడుకు తొలి వికెట్‌పై సచిన టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ ..
ఐపీఎల్లో అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ తీయడం పట్ల పలువురు ప్రముఖ క్రికెటర్లు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. అయితే, తండ్రి సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Sachin Tendulkar and Arjun Tendulkar
Arjun Tendulkar: ఐపీఎల్ 2023 సీజన్లో జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ప్రతీమ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా మారుతుంది. మంగళవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే.. ఐపీఎల్లో రెండో మ్యాచ్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ తీశాడు. చివరి ఓవర్లో ఐదో బంతికి భువనేశ్వర్ కుమార్ ను ఔట్ చేయడం ద్వారా అర్జున్ కు ఐపీఎల్ లో తొలి వికెట్ దక్కింది.
అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ తీయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, ఎంఐ టీం సభ్యులు అర్జున్ వద్దకు చేరుకొని అభినందనలతో ముంచెత్తారు. స్టేడియంలో ప్రేక్షకులుసైతం అర్జున్ అర్జున్ అంటూ నామస్మరణ చేశారు. అర్జున్‌కు ఐపీఎల్ లో ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ 16న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఆడాడు. అందులో రెండు ఓవర్లు వేసి భారీగా పరుగులు ఇచ్చాడు. ఆ తరువాత మళ్లీ బౌలింగ్‌కు అవకాశం రాలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్ లో అర్జున్ తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Sachin Tendulkar son
Arjun Tendulkar: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. సచిన్ కొడుకు అర్జున్ అరంగ్రేటం
ఐపీఎల్లో అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ తీయడం పట్ల పలువురు ప్రముఖ క్రికెటర్లు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. అయితే, కొడుకు తొలి వికెట్ తీయడం పట్ల సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు విజయం తరువాత.. సచిన్ ట్వీట్ చేశారు. ముంబై ఇండియన్స్ మరోసారి అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిందని సచిన్ అభినందించారు.
Arjun Tendulkar Century: అచ్చం తండ్రిలానే.. రంజీలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన అర్జున్ టెండూల్కర్
కామెరాన్ గ్రీన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ ఆకట్టుకున్నాడు. ఇషాన్, తిలక్ బ్యాటింగ్ ఎంతో బాగుంది. ఐపీఎల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. గ్రేట్ గోయింగ్ బాయ్స్ అని సచిన్ ట్వీట్ చేశారు. చివరిలో అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ గురించి ప్రస్తావిస్తూ .. చివరకు టెండూల్కర్‌కి ఐపీఎల్లో ఒక వికెట్ దక్కింది.. అంటూ నవ్వుతున్న ఎంమోజీతో ట్వీట్ చేశారు.
A superb all-round performance by Mumbai Indians once again. Cameron Green impressed with both bat & ball. Ishan & Tilak’s batting is as good as it gets! The IPL is getting more interesting every day. Great going boys!?
And finally a Tendulkar has an IPL wicket!?#SRHvMI pic.twitter.com/e4MAFEZyjY
— Sachin Tendulkar (@sachin_rt) April 18, 2023