Arjun Tendulkar Century: అచ్చం తండ్రిలానే.. రంజీలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన అర్జున్ టెండూల్కర్
అర్జున్ టెండూల్కర్ తన తండ్రి, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ఫాలో అవుతున్నాడు. తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సచిన్ టెండూల్కర్ వలే సెంచరీ చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. అదికూడా ఏడో బ్యాటర్‌గా గ్రౌండ్‌లోకి దిగి సెంచరీ చేశాడు.

Arjun Tendulkar
Arjun Tendulkar Century: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో సచిన్ పేరుపై అనేక రికార్డులు ఇప్పటికీ అంతేఉన్నాయి. సచిన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి సంవత్సరాలు అవుతున్నా ఆయన పేరు చెబితే పూనకాలు వచ్చే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. తాజాగా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తండ్రి బాటలో పయనిస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. 2022 – 23 రంజీ సీజ్ ప్రారంభం కావటంతో అర్జున్ టెండూల్కర్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను గోవా నుంచి ప్రారంభించాడు.
India vs Bangladesh: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. భారత తుది జట్టు ఇదే
రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అర్జున్ అద్భుత సెంచరీ చేశాడు. సచిన్ టెండూల్కర్ సైతం తన రంజీ అరంగ్రేటంలో గుజరాత్‌పై కూడా సెంచరీ సాధించాడు. 23ఏళ్ల అర్జున్ జట్టులో బౌలర్‌గా, ఆల్ రౌండర్‌గా ఆడుతున్నాడు. అయితే బౌలింగ్ కు ముందు బ్యాటింగ్‌లో అద్భుతాలు చేశాడు. ప్రస్తుతానికి అర్జున్ 195 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లు సాయంతో 112 పరుగులు చేశాడు. అతను 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూనే ఈ ఘనత సాధించడం కొసమెరుపు.
India vs Bangladesh 3rd ODI: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. ఇంతకుముందు ఎవరెవరు చేశారంటే?
అర్జున్ టెండూల్కర్ నిజానికి బౌలర్. పదునైనా బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగే సత్తాఉన్న బౌలర్. లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్‌గా బౌలింగ్ చేస్తాడు. అయితే, బ్యాటింగ్‌లోనూ తాజాగా అర్జున్ తన సత్తాను చాటాడు. ఇదిలాఉంటే.. ఐపీఎల్‌లో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం గమనార్హం. అయితే అతనికి ఏ మ్యాచ్‌లోనూ ఆడేఅవకాశం రాలేదు. ఈ రంజీ సీజన్‌లో రాణించడం ద్వారా వచ్చే ఏడాది ఐపీఎల్‌కు బాటలు వేసుకోవచ్చని అర్జున్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ మంచి ప్రదర్శన ఆధారంగా ఐపిఎల్‌లో కూడా అరంగేట్రం చేసే అవకాశం లేకపోలేదు.