India vs Bangladesh: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. భారత తుది జట్టు ఇదే

ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.

India vs Bangladesh: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. భారత తుది జట్టు ఇదే

India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం ఆరంభమైంది. బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్, జహుర్ అహ్మద్ చౌదురి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది.

Twitter: 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్న ట్విట్టర్.. కారణమిదే!

మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ ఉత్సాహంతో ఉండగా, వరుస పరాజయాలతో భారత్ సతమతమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత జట్టు పరువు కాపాడుకునే వీలుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, సిరీస్ గెలవలేకపోయినప్పటికీ, జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంతకుముందు న్యూజిలాండ్ సిరీస్.. ఇప్పుడు బంగ్లాదేశ్ సిరీస్.. రెండింటిలోనూ భారత జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. దీంతో జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ మన జట్టుకు కీలకంగా మారింది. భారత జట్టుకు సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ గత మ్యాచ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

Boy In Borewell: విషాదం.. బోరుబావిలో పడ్డ బాలుడు మృతి.. ఫలించని నాలుగు రోజుల ప్రయత్నం

ఈ మ్యాచ్ రాహుల్ సత్తాకు కూడా చాలా కీలకం. ఆటగాడిగానూ ఇటీవల రాహుల్ విఫలమవుతున్నాడు. దీంతో రాహుల్ ఈ మ్యాచ్ ద్వారా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో వైఫల్యం భారత జట్టును కుదిపేస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ రాణిస్తే, భారీ స్కోరు సాధించి జట్టు విజయం సాధించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా ఆడుతున్నారు. భారత తుది జట్టు: శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.