Twitter: 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్న ట్విట్టర్.. కారణమిదే!

ట్విట్టర్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్నట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించాడు.

Twitter: 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్న ట్విట్టర్.. కారణమిదే!

Twitter: ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే సిబ్బంది తొలగింపు, ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ వంటి నిర్ణయాలు తీసుకున్న మస్క్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.

Indian Citizenship: భారత పౌరసత్వం వదులుకున్న 16 లక్షల మంది.. పదకొండేళ్ల వివరాలు చెప్పిన కేంద్రం

కొంతకాలంగా యాక్టివ్‌గా లేని 150 కోట్ల అకౌంట్లను డిలీట్ చేయాలని నిర్ణయించాడు. చాలా ఏళ్లుగా ట్వీట్లు లేకుండా, లాగిన్ లేకుండా ఉన్న 150 కోట్ల ట్విట్టర్ అకౌంట్లను తొలగించనున్నట్లు మస్క్ తెలిపాడు. అలాగే యూజర్ల ట్వీట్లు షాడో బ్యానింగ్‌కు గురయ్యాయో లేదా తెలుసుకునే విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించాడు. ట్వీట్లు బ్యాన్‌కు గురైతే, ఆ విషయాన్ని యూజర్లకు తెలియజేస్తుంది కంపెనీ. దీనిపై యూజర్లు ట్విట్టర్‌కు ఫిర్యాదు చేసి రివ్యూ కోరవచ్చు. సాధారణంగా రాజకీయపరమైన ట్వీట్లు ఇలా షాడో బ్యానింగ్‌కు గురవుతాయి. ఇటీవల ట్విట్టర్ ఫైల్స్-2 పేరిట కంపెనీకి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు బయటపడ్డాయి.

Uttar Pradesh: తల్లి ప్రయత్నం ఫలించింది… మరణించిన అమ్మాయి తిరిగొచ్చింది.. అరుదైన ఘటన

వీటిద్వారా కంపెనీ ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఉన్న యాజమాన్యం సీక్రెట్‌గా కొనసాగించిన గ్రూప్ తీసుకున్న నిర్ణయాలివి. దీని ప్రకారం కొందరు హై ప్రొఫైల్ వ్యక్తులకు సంబంధించిన పలు ట్వీట్లు షాడో బ్యానింగ్‌కు గురయ్యాయి. ఈ సీక్రెట్ గ్రూపులో ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ, విజయ గద్దె, యోల్ రోత్, పరాగ్ అగర్వాల్ వంటి కీలక వ్యక్తులు ఉన్నారు. అయితే, తాము ఏ ట్వీట్లను షాడో బ్యానింగ్‌ చేయలేదని గతంలో కంపెనీ తెలిపింది.