Indian Citizenship: భారత పౌరసత్వం వదులుకున్న 16 లక్షల మంది.. పదకొండేళ్ల వివరాలు చెప్పిన కేంద్రం

2011 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 16 లక్షల మంది ప్రజలు దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాదిలోనే 1,83,000 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపింది.

Indian Citizenship: భారత పౌరసత్వం వదులుకున్న 16 లక్షల మంది.. పదకొండేళ్ల వివరాలు చెప్పిన కేంద్రం

Indian Citizenship: గడిచిన 11 ఏళ్లలో 16 లక్షల మందికిపైగా ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాదిలోనే 1,83,000 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలిపింది. 2015 నుంచి ఎంత మంది ప్రజలు దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారో చెప్పాలని కాంగ్రెస్ నేత అబ్దుల్ ఖలీల్ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.

Pawan Kalyan: రూల్స్ పవన్ కల్యాణ్‌కేనా? వైసీపీపై ట్విట్టర్లో విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీధరన్ లోక్‌సభలో శుక్రవారం ఈ వివరాల్ని వెల్లడించారు. ఆయన చెప్పిన అంచనాల ప్రకారం.. 2011 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 16 లక్షల మందికిపైగా పౌరులు భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. అందులో ఈ ఏడాదే 1,83,000 మంది పౌరసత్వాన్ని విడిచిపెట్టారు. 2011లో 122,819 మంది, 2012లో 120,923 మంది, 2013లో 131,405, 2014లో 129,328 మంది, 2015లో 131,489 మంది, 2016లో 141,603 మంది, 2107లో 133,049 మంది, 2018లో 134,561 మంది, 2019లో 144,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 163,370 మంది, 2022 అక్టోబర్ 31 వరకు 1,83,741 మంది దేశాన్ని, పౌరసత్వాన్ని వదులుకుని వెళ్లారు.

Sonia Gandhi: రాహుల్‌తో కలిసి 76వ పుట్టిన రోజు జరుపుకొన్న సోనియా గాంధీ

కాగా, విదేశాలకు వెళ్లేటప్పుడు దేశ సంపదను ఎంత తీసుకెళ్లారో కూడా చెప్పాలని ఖలీల్ ప్రశ్నించారు. అయితే, ఈ అంశానికి సంబంధించిన సమాచారం ఏదీ తమ వద్ద లేదని మురళీధరన్ అన్నారు. 8,441 మంది భారతీయులు విదేశీ జైళ్లలో ఉన్నారని, వీరిలో అండర్ ట్రయల్ ఖైదీలు కూడా ఉన్నట్లు కేంద్రం చెప్పింది.