Boy In Borewell: విషాదం.. బోరుబావిలో పడ్డ బాలుడు మృతి.. ఫలించని నాలుగు రోజుల ప్రయత్నం

నాలుగు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ తన్మయ్ సాహు అనే ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్, బెతుల్ జిల్లా, మాండ్వి అనే గ్రామంలో జరిగింది. నాలుగు రోజులపాటు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Boy In Borewell: విషాదం.. బోరుబావిలో పడ్డ బాలుడు మృతి.. ఫలించని నాలుగు రోజుల ప్రయత్నం

Boy In Borewell: బోరుబావిలో పడ్డ బాలుడి కథ విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ తన్మయ్ సాహు అనే ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్, బెతుల్ జిల్లా, మాండ్వి అనే గ్రామంలో జరిగింది.

Twitter: 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్న ట్విట్టర్.. కారణమిదే!

గత మంగళవారం తన్మయ్ పొలం దగ్గర ఆడుకుంటూ ఉండగా, ప్రమాదవశాత్తు దగ్గర్లోని 55 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయాడు. అక్కడే ఉన్న తన్మయ్ సోదరి దీన్ని చూసింది. వెంటనే తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వెంటనే బోరుబావి వద్దకు చేరుకున్నారు. అప్పటికి తన్మయ్ బతికే ఉన్నాడు. తల్లిదండ్రుల పిలుపునకు తన్మయ్ స్పందించాడు కూడా. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా దళాలు, కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఈ పనుల్ని పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కూడా దీనిపై స్పందించి, బాలుడిని క్షేమంగా రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

Viral Video: వీడెవడండీ బాబు… మొసలిలాగా డ్రెస్ వేసుకుని, మొసలితోనే ఆటలు.. షాకింగ్ వీడియో

అయితే, బావి 55 అడుగుల లోతు ఉండటంతో బాలుడిని చేరుకునేందుకు ఎక్కువ టైమ్ పట్టింది. ఈ లోగా అధికారులు బాలుడికి ఆక్సిజన్, ఆహారం అందించే ప్రయత్నం చేశారు. అయితే, తర్వాత బాలుడి నుంచి ఎలాంటి స్పందనా లేదని, అతడి పరిస్థితి ఏంటో చెప్పలేమని అధికారులు చెప్పారు. చివరకు శనివారం వేకువఝామున అధికారులు బాలుడిని బయటికి తీశారు. ప్రత్యేక అంబులెన్సులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అతడు మరణించినట్లు వెల్లడించారు. దీంతో బాలుడి కథ విషాదంగా ముగిసింది.