Viral Video: వీడెవడండీ బాబు… మొసలిలాగా డ్రెస్ వేసుకుని, మొసలితోనే ఆటలు.. షాకింగ్ వీడియో

మొసలిని చూస్తే ఎవరైనా భయపడుతారు. అందులోనూ నదుల్లో సహజంగా పెరిగే వైల్డ్ మొసలి అయిత మరీ ప్రమాదకరం. అయితే, అలాంటి మొసలితో ఒక వ్యక్తి ఆటలాడాడు.

Viral Video: వీడెవడండీ బాబు… మొసలిలాగా డ్రెస్ వేసుకుని, మొసలితోనే ఆటలు.. షాకింగ్ వీడియో

Updated On : December 10, 2022 / 8:56 AM IST

Viral Video: ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటే ఇదేనేమో! సాధారణంగా మొసలి దగ్గరికి ఎవరైనా వెళ్లాలంటేనే భయపడుతారు. అసలు అది కనిపిస్తేనే వణుకుతారు. అలాంటిది ఒక వ్యక్తి మాత్రం మొసలి పక్కనే పడుకుని, తమాషా చేశాడు. అది కూడా మొసలిలాగా డ్రెస్ చేసుకుని, దాన్ని ఆటపట్టించాడు.

Twitter: 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్న ట్విట్టర్.. కారణమిదే!

ఆ వ్యక్తి ఏం చేద్దామనుకున్నాడో కానీ.. తన ప్రాణాన్ని మాత్రం రిస్క్‌లో పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం.. నది ఒడ్డున మొసలి సేద తీరుతోంది. ఒక వ్యక్తి మొసలిలాగా డ్రెస్ చేసుకుని, దాని పక్కనే పడుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్న ఆ మొసలి దగ్గరికి వెళ్లి, దాన్ని రెచ్చగొట్టాలని చూశాడు. మొసలి కాలు పట్టుకుని లాగాడు. అయినప్పటికీ ఆ మొసలి ఏమాత్రం స్పందించలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మనిషిని చంపగలిగే మొసలితో ఆటలేంటని విమర్శిస్తున్నారు. ఏదైనా జరిగితే అతడి ప్రాణాలకే ముప్పని తప్పుబడుతున్నారు. ధైర్యానికి, మూర్ఖత్వానికి మధ్య ఒక గీత ఉంటుందని.. అతడు చేసింది ధైర్యమైన పని కాదని, మూర్ఖత్వంతో కూడిన పని అని పలువురు విమర్శిస్తున్నారు.