WPL 2024 : డబ్ల్యూపీఎల్‌లో విరాట్ కోహ్లి కొడుకు అకాయ్‌కు స్వాగతం పలికిన అభిమానులు
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Published On : February 25, 2024 / 10:55 AM IST
RCB fans welcome Virat Kohli’s son Akaay during WPL 2024 match
Women’s Premier League 2024 : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే ప్రాంచైజీకి ఆడుతున్న క్రికెటర్ కోహ్లి మాత్రమే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతుండడంతో బెంగళూరు అతడికి మరో హోం గ్రౌండ్‌గా మారింది. బెంగళూరులో ఐపీఎల్ మాత్రమే కాదు ఏ మ్యాచ్ జరిగినా విరాట్ నామస్మరణతో మారుమోగిపోతుంటుంది.
ఫిబ్రవరి 15న విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులకు కుమారుడు జన్మించాడు. అతడికి అకాయ్ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా కోహ్లి వెల్లడించాడు. ఇక అప్పటి నుంచి అకాయ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అకాయ్‌కు స్వాగతం పలికారు అభిమానులు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్జ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది.
డబ్ల్యూపీఎల్ 2024 భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, యూపీ జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బెంగళూరు అభిమానులు కోహ్లి, అతడి కుటుంబ సభ్యులపై ప్రేమ, మద్దతును ప్రదర్శించారు. అభిమానులు అకాయ్‌ని సింహం పిల్లగా చిత్రీకరిస్తూ ఆర్‌సీబీకి స్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.
Virat Kohli fans welcoming Akaay to RCB. pic.twitter.com/NCP1TxmxB5
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 24, 2024
రెండో బిడ్డకు అనుష్కశర్మ జన్మనివ్వనుండడంతో ఆమెతో ఉండేందుకు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. చివరిసారి అతడు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడాడు. అతడు ఐదో టెస్టు మ్యాచ్ ఆడతాడా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఐపీఎల్ 2024 సీజన్‌లో మళ్లీ కోహ్లి బరిలోకి దిగనున్నాడని అంటున్నారు.
Akaay Fans in Chinnaswamy Stadium. ?? pic.twitter.com/oq55FuLKIr
— Johns. (@CricCrazyJohns) February 24, 2024
