WPL 2024 : న‌న్ను పెళ్లి చేసుకుంటావా..? లైవ్ మ్యాచ్‌లో భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌కి ప్రపొజ‌ల్‌.. రిప్లై ఏమి వ‌చ్చిందంటే?

క్రికెట‌ర్లు అంటే ఎంతో మందికి ఇష్టం అన్న సంగ‌తి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

RCB player Receives Marriage Proposal From Fan During WPL 2024 Match

WPL 2024 – Shreyanka Patil : క్రికెట‌ర్లు అంటే ఎంతో మందికి ఇష్టం అన్న సంగ‌తి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే.. కొంద‌రు మాత్రం త‌మ‌ను పెళ్లి చేసుకుంటారా అనే ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆట‌గాళ్ల ముందు ఉంచ‌డాన్ని అప్పుడ‌ప్పుడు పురుషుల క్రికెట్‌లో చూస్తూనే ఉంటాం. తాజాగా మ‌హిళ‌ల క్రికెట్‌లోనూ అలాంటి ఓ ఘ‌ట‌న‌నే జ‌రిగింది. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌)2024లో ఇది చోటు చేసుకుంది.

టీమ్ఇండియా ప్లేయ‌ర్ అయిన శ్రేయాంక పాటిల్ డ‌బ్ల్యూపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో మంగ‌ళ‌వారం గుజ‌రాత్ జెయింట్స్‌తో ఆర్‌సీబీ త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ఏడో ఓవ‌ర్‌లో శ్రేయాంక పాటిల్‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ వ‌చ్చింది. ప్రేక్ష‌కుల గ్యాల‌రీ నుంచి శ్రేయాంక పాటిల్ మీరు న‌న్ను పెళ్లి చేసుకుంటారా..? అని రాసిన ఉన్న ఫ్ల‌కార్డును ఓ అభిమాని ప్ర‌ద‌ర్శించాడు.

Shreyas Iyer : పురుషుల జ‌ట్టు నుంచి తొల‌గించార‌ని.. మ‌హిళ‌ల లీగ్‌లో అంపైరింగ్ చేస్తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ?

కెమెరాలు అన్నీ దానిపైనే ఫోక‌స్ చేశాయి. మైదానంలోని పెద్ద స్ర్కీన్ల‌తో పాటు లైవ్‌లోనూ ఇది క‌నిపించింది. దీన్ని చూసిన ఆట‌గాళ్లు న‌వ్వుకున్నారు. దీనిపై శ్రేయాంక మాత్రం స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఈ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు 13 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ స్మృతీ మంధాన (43), స‌బ్బినేని మేఘ‌న (35 నాటౌట్‌), ఎల్సీ పెర్రీ(23 నాటౌట్‌) లు రాణించారు. ఇక ఈ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ ఓ ఓవ‌ర్‌ను వేసింది. 13 ప‌రుగులు ఇచ్చింది. అయితే.. స్వ‌ల్ప ల‌క్ష్యం కావ‌డంతో ఈ ఆల్‌రౌండ‌ర్‌కు బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు.

ICC Test Rankings : రోహిత్ శ‌ర్మ‌కు షాకిచ్చిన య‌శ‌స్వి జైస్వాల్.. త్వ‌ర‌లోనే కోహ్లికి ఎస‌రు?

ట్రెండింగ్ వార్తలు