RCBvsCSK: చెన్నై టార్గెట్ 162 పరుగులు మాత్రమే

బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 7వికెట్లు నష్టపోయి 161పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా పేలవ ప్రదర్శన చేయడంతో జట్టు భారీ స్కోరు నమోదు చేయలేకపోయింది. పార్థివ్ మినహాయించి జట్టులో ఒక్కరు కూడా 30పరుగులు చేయలేకపోయారు. చెన్నై బౌలర్లు దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, బ్రావో తలో 2వికెట్లు తీయగా ఇమ్రాన్ తాహిర్ 1వికెట్ పడగొట్టాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ(9), డివిలియర్స్(25), అక్షదీప్ సింగ్(24), మార్కస్ స్టోనిస్(14), మొయిన్ అలీ(26), పవన్ నేగీ(5), ఉమేశ్ యాదవ్(1), డేల్ స్టెయిన్(0)పరుగులు మాత్రమే చేయగలిగారు. గత మ్యాచ్‌లో విరుచుకుపడిన బెంగళూరు ప్లేయర్ల నుంచి ఇటువంటి పేలవ ప్రదర్శన రావడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.