Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో మ‌రో మ‌హిళా అథ్లెట్ పై వేటు..

పారిస్ ఒలింపిక్స్‌లో మ‌రో అథ్లెట్ పై అన‌ర్హ‌త వేటు ప‌డింది.

Refugee athlete disqualified for free Afghan women slogan on cape

Paris Olympics – Manizha Talash : పారిస్ ఒలింపిక్స్‌లో మ‌రో అథ్లెట్ పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. అఫ్గానిస్తాన్‌కు చెందిన మ‌నీజా త‌లాష్ పై ఒలింపిక్స్ క‌మిటీ అన‌ర్హ‌త వేటు వేసింది. బ్రేక్‌డాన్స్ ఈవెంట్‌లో ఆమె ఫ్రీ అఫ్గాన్ విమెన్‌ అని రాసిన కేప్‌ను ధ‌రించిడ‌మే ఇందుకు కార‌ణం. ఒలింపిక్స్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఆట‌ల్లో ఎలాంటి రాజ‌కీయ‌, మ‌త‌ప‌ర‌మైన వంటి స్లోగ‌న్లు, ప్ర‌క‌ట‌న‌లు చేయ‌కూడ‌దు. 21 ఏళ్ల మ‌నీజా శ‌ర‌ణార్థు జ‌ట్టు త‌రుపున బ్రేక్‌డాన్స్ ఈవెంట్‌లో పాల్గొంది.

కాబూల్‌కు చెందిన తలాష్ ప్ర‌స్తుతం స్పెయిన్‌లో నివ‌సిస్తోంది. 2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబ‌న్లు స్వాధీనం చేసుకున్న అఫ్గాన్ నుంచి పారిపోయింది. అఫ్గానిస్తాన్‌లో తాలిబ‌న్ల పాల‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌హిళ‌లు ఎన్నో ఆంక్ష‌ల‌ను ఎదుర్కొంటున్నారు. బాలిక‌ల పాఠ‌శాల‌ల‌ను మూసి వేశారు. మ‌హిళ‌లు డ్యాన్స్ చేయ‌డం, ఆట‌ల ఆడ‌డం పై నిషేదం విధించారు. ఓ పురుషుడు తోడు లేకుండా ఒంటిరిగా మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌రాదు వంటి ఎన్నో నిబంధ‌న‌ల‌ను తీసుకువ‌చ్చారు.

Imane Khelif : ‘నేను అమ్మాయినే..’ స్వ‌ర్ణం గెలిచిన త‌రువాత అల్జీరియా బాక్స‌ర్ ఇమానె ఆవేద‌న‌..

ఈ క్ర‌మంలో అఫ్గాన్ అథ్లెట‌ను శ‌ర‌ణార్థి జ‌ట్టు త‌రుపున బ‌రిలోకి దిగేందుకు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ అనుమ‌తి ఇచ్చింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ మరియు బాక్సింగ్‌తో సహా 12 విభిన్న క్రీడలలో 37 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఈ జ‌ట్టులో త‌లాష్ ఒక‌రు. ఆమె అఫ్గానిస్తాన్‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను తెలియ‌జేస్తూ ఇలా ప్ర‌ద‌ర్శించింది. దీనిపై వరల్డ్ డ్యాన్స్ స్పోర్ట్ ఫెడరేషన్ స్పందించింది. పోటీల్లో రాజ‌కీయ‌మైన స్లోగ‌న్ల‌ను ప్ర‌ద‌ర్శించడం స‌రైంది కాదు. అందుకే త‌లాష్ డిస్‌క్వాలిపై చేస్తున్నాం అని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

“నేను సాధ్యమయ్యే వాటిని ప్రజలకు చూపించాలనుకుంటున్నాను” అని ఆమె విలేకరులతో అన్నారు. రౌండ్-రాబిన్ దశకు ముందే తలాష్ పోటీ నుండి ఎలిమినేట్ చేయబడింది. కానీ ఆమె సందేశం పెద్ద వేదికపై కనిపిస్తుంది.

Aman Sehrawat : అమ‌న్ కొద్దిలో త‌ప్పించుకున్నాడా..! లేదంటే వినేశ్ ఫోగ‌ట్‌లానే అన‌ర్హ‌త వేటు ప‌డేదా..! 10 గంట‌ల్లో 4.6 కేజీలు..

ట్రెండింగ్ వార్తలు