Report Claims Akash Deep To Make India Debut In Ranchi Test
India vs England : రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు సీనియర్ ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బీసీసీఐ అతడికి విశ్రాంతినిచ్చింది. అయితే.. బుమ్రా స్థానంలో నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఎవరు బరిలోకి దిగనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్ లు ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది.
వీరిద్దరిలో ఆకాశ్‌దీప్ ను బరిలోకి దించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే రాంచీ టెస్టుతో ఆకాశ్‌దీప్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేయడం ఖాయం. భారత్-ఏ తరుపున ఆకాశ్‌దీప్ ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచుల్లో 11 వికెట్లతో రాణించాడు. ఈ ప్రదర్శన మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ముకేశ్ కుమార్ సైతం రంజీ ట్రోఫీలో బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు తీశారు.
6 Sixes In 1 Over : ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తెలుగు క్రికెటర్.. బీసీసీఐ అలర్ట్..
అయితే.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ముకేశ్ కుమార్ తేలిపోవడం అతడికి ప్రతికూలాంశంగా మారింది. కేవలం ఒకే ఒక వికెట్ తీయగా బుమ్రా మాత్రం తొమ్మిది వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఆకాశ్ సింగ్ రివర్స్ స్వింగ్ రాబట్టడంతో దిట్ట కావడం అతడికి సానుకూలాంశం. ఇప్పటి వరకు ఆకాశ్ 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. 104 వికెట్లు పడగొట్టాడు. ఒకవేళ ఆకాశ్ దీప్ రాంచీ టెస్టు ఆడితే.. ఈ సిరీస్‌లో అరంగ్రేటం చేసిన మూడో ఆటగాడిగా నిలవనున్నాడు. ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు అరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. హైదారాబాద్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓడిన తరువాత భారత్ బలంగా పుంజుకుంది. విశాఖ, రాజ్‌కోట్‌ల లో జరిగిన టెస్టు మ్యాచుల్లో గెలుపొందింది. రాంచీలోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
Sachin Tendulkar : రిటైర్మెంట్ అయి పదేళ్లు.. అయినా గానీ.. సచిన్‌కు క్రేజీ అనుభవం..