Sanjay Manjrekar : బ్యాటింగ్ చేసే అవ‌కాశం రావ‌డం లేదు.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటివ్వండి?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.

Sanjay Manjrekar – Rinku Singh : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఈ లీగ్ ముగిసిన వెంట‌నే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా త‌రుపున ఎవ‌రు చోటు ద‌క్కించుకుంటారు అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఐపీఎల్‌లో రాణించిన‌వారికి ఎక్కువ అవ‌కాశాలు ఇవ్వ‌నున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లువురు యువ ఆట‌గాళ్లు ఐపీఎల్‌లో స‌త్తా చాటుతున్నారు.

ఏదీ ఏమైన‌ప్ప‌టికీ ఫినిష‌ర్‌గా రింకూసింగ్‌ను ఎంపిక చేయాల‌ని భార‌త మాజీ క్రికెట‌ర్‌, కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ అన్నారు. ఈ సీజ‌న్‌లో రింకూసింగ్‌కు ఎక్కువ‌గా బ్యాటింగ్ చేసే అవ‌కాశం రావ‌డం లేద‌న్నాడు. అయిన‌ప్ప‌టికీ సెల‌క్ట‌ర్లు రింకూ సింగ్ పేరును మ‌రిచిపోర‌నే అనుకుంటున్న‌ట్లు చెప్పారు. అత‌డు నిల‌క‌డైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకోవ‌డం చూస్తూనే ఉన్నామ‌న్నారు.

MS Dhoni : ద‌క్షిణాఫ్రికాలోనూ ధోని ఫీవ‌ర్ ఉందా? నిజాన్ని చెప్పిన డేల్ స్టెయిన్‌

భార‌త జ‌ట్టులో అత‌డు కీల‌క స‌భ్యుడని, కొంత‌మంది స్టార్ క్రికెట‌ర్ల కంటే రింకూ అద్భుతంగా ఆడతాడ‌ని మంజ్రేక‌ర్ కితాబిచ్చాడు. ఈ టోర్నీ త‌రువాత అత‌డు నేరుగా మెగాటోర్నీలో అడుగుపెట్టే స‌త్తా క‌లిగి ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2023లో రింకూ సింగ్ అద‌ర‌గొట్టాడు. ఓ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా ఐదు సిక్స‌ర్లు బాది త‌న జ‌ట్టును గెలిపించాడు. ఆ సీజ‌న్‌లో 14 మ్యాచుల్లో 59.25 స‌గ‌టు 150 స్ట్రైక్ రేట్‌తో 474 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టులోనూ చోటు ద‌క్కించుకున్నాడు. త‌న‌దైన ముద్ర వేశాడు. అయితే.. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు మ్యాచులు ఆడాడు. అత‌డికి ఎక్కువ‌గా బ్యాటింగ్ చేసే అవ‌కాశం రావ‌డం లేదు. 51 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. 162.75 స్ట్రైక్‌రేటుతో 83 ప‌రుగులు చేశాడు. రెండు సార్లు అజేయంగా నిలిచాడు.

Mohammad Nabi : హార్దిక్ పాండ్య‌పై న‌బీ అసంతృప్తి..! ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఎక్కువ‌గా బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాక‌పోవ‌డంతో అది అత‌డి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఎంపిక పై ప్ర‌భావం ప‌డ‌నుంద‌నే వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మంజ్రేక‌ర్ పై విధంగా స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు