Rinku Singh : చిన్న పిల్లాడికి సారీ చెప్పిన రింకూసింగ్.. ఏం జరిగిందో తెలుసా..?
టీమ్ఇండియా నయా ఫినిషర్, కోల్‌కతా స్టార్ ఆటగాడు రింకూ సింగ్స్ సైతం నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు
- Thota Vamshi Kumar
- Published On : March 12, 2024 / 03:17 PM IST
Rinku Singh's six hit young cricketer as batter apologizes with a signed cap
Rinku Singh – IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మరో 10 రోజుల్లో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సైతం ప్రాక్టీస్ చేస్తుండగా ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
టీమ్ఇండియా నయా ఫినిషర్, కోల్‌కతా స్టార్ ఆటగాడు రింకూ సింగ్స్ సైతం నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. అలవోకగా సిక్స్‌లు కొట్టేందుకు భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బంతి బౌండరీకి వెలుపల ఉన్న ఓ బాలుడి నుదిటికి తగిలింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రింకూ సింగ్ ఆ టీనేజ్ కుర్రాడి వద్దకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. అనంతరం ఆ కుర్రాడికి క్షమాపణలు చెప్పాడు.
Mohammad Amir : ఫిక్సర్ ఫిక్సర్ అంటూ అరుపులు.. కోపంతో ఊగిపోయిన అమీర్.. వీడియో వైరల్
కోల్‌కతా బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ అతడికి కేకేఆర్ టోపీని అందించాడు. ఆ టోపి పై రింకూ సింగ్ సంతకం చేసి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రింకూ సింగ్ ది ఎంత మంచి మనసో అని ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఐదు బంతుల్లో 5 సిక్సులు..
ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా రింకూ సింగ్ వెలుగులోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కేకేఆర్ విజయానికి ఆఖరి 5 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సలు బాది జట్టుకు నమ్మశక్యం గానీ విజయాన్ని అందించాడు. ఐపీఎల్‌లో రాణించడంతో టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్ నిలకడగా రాణిస్తూ నయా ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
Rishabh Pant : శుభవార్త.. ఐపీఎల్ 2024 ఆడేందుకు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటన
All heart, Rinku Bhaiya! ? pic.twitter.com/C04HlEDXmF
— KolkataKnightRiders (@KKRiders) March 12, 2024
