Rishabh Pant : రిషబ్ పంత్ అరుదైన ఘనత.. గిల్, కోహ్లిల తరువాత ఒకే ఒక్కడు..
రీ ఎంట్రీలో రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 13, 2024 / 10:39 AM IST
PIC Credit@DC twitter
Rishabh Pant 3000 runs in IPL : రీ ఎంట్రీలో రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో 3వేల పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. శుక్రవారం ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ రికార్డును అందుకున్నాడు. కాగా..ఈ మ్యాచ్‌లో పంత్ 24 బంతుల్లో 41 పరుగులు సాధించాడు.
శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లిలు మాత్రమే పంత్ కన్నా తక్కువ వయసులో 3వేల పరుగులు సాధించిన జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 26 ఏళ్ల 191 రోజుల వయసులో పంత్ ఈ ఘనతను అందుకోగా శుబ్‌మన్ గిల్ 24 ఏళ్ల 215 రోజులు, విరాట్ కోహ్లి 26 ఏళ్ల 186 రోజుల తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా.. ఐపీఎల్‌లో మూడు వేల పరుగులు కంటే ఎక్కువగా పరుగులు చేసిన 25 మంది బ్యాటర్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ (151.68), క్రిస్ గేల్ (148.96) తరువాత అత్యధిక స్ట్రైక్ రేటు పంత్ (148.4 )దే కావడం గమనార్హం.
IPL 2024 : ఆర్సీబీపై విజయం తరువాత ముంబై ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూంలో ఏం చేశారో తెలుసా.. వీడియో వైరల్
అతి పిన్న వయసులో ఐపీఎల్‌లో 3వేల పరుగులు చేసిన ఆటగాళ్లు..
శుభ్‌మన్ గిల్ – 24 ఏళ్ల 215 రోజులు
విరాట్ కోహ్లీ – 26 ఏళ్ల 186 రోజులు
రిషబ్ పంత్ – 26 ఏళ్ల 191 రోజులు
సంజు శాంసన్ – 26 ఏళ్ల 320 రోజులు
సురేష్ రైనా – 27 ఏళ్ల 161 రోజులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఆయుష్ బదోని (55నాటౌట్; 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) రాణించారు. అనంతరం లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో పూర్తి చేసింది. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (55; 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రిషబ్ పంత్ (41; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సర్లు) దూకుడుగా ఆడారు.
IPL 2024 : కుల్దీప్.. బాల్‌ను ఇలా తిప్పితే ఆడేదెట్ల! పూరన్‌కు దిమ్మతిరిగిపోయింది.. వీడియో వైరల్
??? ??????? ???-??????. ??? ????? ??
We love you 3️⃣0️⃣0️⃣0️⃣, Rishabh ❤️?#YehHaiNayiDilli #IPL2024 #LSGvDC pic.twitter.com/WZ4dXSGqny
— Delhi Capitals (@DelhiCapitals) April 12, 2024
